సాయి దుర్గ తేజ్ కెరీర్లో చాలా ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ చిత్రాల్లో ‘రిపబ్లిక్’ ఒకటి. వెన్నెల, ప్రస్థానం చిత్రాలతో తనదైన ముద్ర వేసిన దేవ్ కట్టా ఈ చిత్రాన్ని రూపొందించాడు. చాలా మంచి సినిమాగా పేరు తెచ్చుకున్నప్పటికీ ‘రిపబ్లిక్’ కమర్షియల్ సక్సెస్ మాత్రం కాలేదు. ఈ చిత్రానికి సరైన ఓపెనింగ్స్ కూడా రాలేదు. కానీ ఓటీటీ రిలీజైనపుడు అందరూ ఆహా ఓహో అన్నారు. దేవ్ కట్టా రైటింగ్, డైరెక్షన్.. అలాగే తేజు నటనను అందరూ కొనియాడారు. ఐతే ఈ సినిమాలో కొన్ని మార్పులు చేసి ఉంటే కమర్షియల్‌గా సక్సెస్ అయ్యేదన్న అభిప్రాయాలు అప్పట్లో వ్యక్తమయ్యాయి.
ముఖ్యంగా చివర్లో హీరోను చంపేయడం పట్ల మాస్ ప్రేక్షకుల్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అలాంటి ముగింపును తెలుగు ప్రేక్షకులు భరించలేరనే అభిప్రాయాలున్నాయి. సినిమాకు కొంచెం కమర్షియల్ టచ్ ఇవ్వాల్సిందన్న చర్చ జరిగింది.ఐతే తాను కూడా ఒక దశలో ‘రిపబ్లిక్’ క్లైమాక్స్‌ను మార్చే విషయమై ఆలోచన చేసినట్లు దర్శకుడు దేవ్ కట్టా ఇప్పుడు వెల్లడించాడు.
కానీ తేజునే అందుకు ఒప్పుకోలేదని అతనన్నాడు. తేజు కొత్త చిత్రం ఫస్ల్ గ్లింప్స్ లాంచ్ వేడుకకు అతిథుల్లో ఒకడిగా వచ్చిన దేవ్.. ‘రిపబ్లిక్’ అనుభవం గురించి మాట్లాడాడు. ‘రిపబ్లిక్’ సినిమా రిలీజైనపుడు చాలామంది ఈ సినిమా క్లైమాక్స్ మారిస్తే కమర్షియల్‌గా మంచి విజయం సాధించేదని అభిప్రాయపడినట్లు దేవ్ వెల్లడించాడు.
రిలీజ్ రోజు కూడా చాలామంది ఫోన్ చేసి చివర్లో హీరో చనిపోవడం బాగా లేదని అన్నారని.. దీంతో తాను కూడా ఆఖరి సీన్ తీసేద్దామా అని ఆలోచించాలనని దేవ్ చెప్పాడు. ఇదే విషయమై తేజుకు ఫోన్ చేస్తే.. ‘‘క్లైమాక్స్ మారిస్తే ఈ సినిమా నాది కాదు’’ అని తేల్చి చెప్పేశాడని, దటీజ్ తేజు అని దేవ్ కట్టా వ్యాఖ్యానించాడు. ‘హనుమాన్’ నిర్మాతలు ప్రొడ్యూస్ చేస్తున్న తేజు కొత్త చిత్రాన్ని రోహిత్ అనే డెబ్యూ డైరెక్టర్ తెరకెక్కిస్తున్నాడు. వచ్చే ఏడాది దసరాకు ఈ చిత్రం విడుదల కానుంది.
This post was last modified on December 13, 2024 12:43 pm
వైసీపీ పాలనలో ఆ పార్టీ నేతలు నిత్యం టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై సెటైర్ల మీద సెటైర్లు వేసే వారు.…
ఈ రోజుల్లో ఓ సినిమా విడుదలైన 4 రోజుల తర్వాత కూడా థియేట్రికల్ రన్ కొనసాగించడం అంటే అరుదైన విషయమే.…
సూర్య సినిమా ‘కంగువా’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ ఆ…
ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కుకు నిజంగానే కొత్త జీవం వచ్చేసింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న విశాఖ ఉక్కుకు జీవం పోసేలా...…
సోషల్ మీడియా ప్రపంచంలో రోజురోజుకి నెగటివిటీ ఎక్కువైపోతోంది. ఇది ఏ స్థాయికి చేరుకుందంటే వందల కోట్లు పోసిన ఒక ప్యాన్…
ఇప్పుడు ఫిలిం మేకింగ్ లో కొత్త పోకడలు ఎన్నో వచ్చాయి. గతంలో రచయితలు పేపర్ బండిల్, పెన్ను పెన్సిల్, ఇతర…