అతి తక్కువ రోజుల్లో వెయ్యి కోట్ల మార్కుని దాటిన మొదటి ఇండియన్ సినిమాగా పుష్ప 2 ది రూల్ సాధించిన సక్సెస్ ని పంచుకోవడానికి ఇవాళ అల్లు అర్జున్ అండ్ టీమ్ ఢిల్లీలో అడుగు పెట్టింది. ఉత్తరాది రాష్ట్రాల్లో బ్రహ్మాండమైన ఆదరణ దక్కుతున్న నేపథ్యంలో ఈ ఆనందాన్ని వ్యక్తపరచడానికి నార్త్ మీడియాని కలుసుకుంది. హిందీలో డిస్ట్రిబ్యూట్ చేసిన పంపిణీదారులు హాజరు కావడమే కాక తమకు పుష్ప 2 ఎంత కనక వర్షం కురిపించిందో వర్ణిస్తూ, షోల డిమాండ్ తట్టుకోలేకపోయిన వైనాన్ని వివరించారు. ఎప్పుడూ ఇంత వసూళ్ల సునామిని చూడలేదంటూ యుపి తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన ఎగ్జిబిటర్లు ఆనందం వ్యక్తం చేశారు.
అల్లు అర్జున్ మాట్లాడుతూ హిందీ ఆడియన్స్ లేకపోతే పుష్ప 1, పుష్ప 2 రెండూ ఉండేవి కావని, ఇంత విజయం సాధించడంలో మీరే ప్రధాన భూమిక పోషించారని ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ రికార్డులు ఇంకో రెండు మూడు నెలలు లేదా వేసవి దాకా ఉండొచ్చేమో కానీ వీటిని దాటే మరో గొప్ప సినిమా ఏ భాషలో అయినా వస్తుందని, కంటిన్యూటీ కొనసాగుతూ ఉండాలని ఆకాంక్షను వ్యక్తం చేశాడు. ప్రత్యేకంగా ఫలానా మూవీ అని ప్రస్తావించలేదు కానీ పుష్ప 2 రికార్డులు శాశ్వతంగా ఉండవని చెప్పడం చూస్తే టాలీవుడ్ స్థాయి మరింత పైపైకి వెళ్తుందనే సంకేతం తన మాటల ద్వారా ఐకాన్ స్టార్ ఇచ్చాడు.
ప్రసంగం మొదట్లోనే దర్శకుడు సుకుమార్ మీద తనకున్న అభిమానం, ప్రేమను మనస్ఫూర్తిగా ప్రదర్శించిన బన్నీ ఆయన లేకపోతే పుష్ప ప్రపంచం ఉండేది కాదని మరోసారి నొక్కి చెప్పాడు. యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మీ భార్య మాట వింటే జీవితంలో పైకి వస్తారని పుష్ప 2లో శ్రీవల్లి అడిగిన ఫోటో వల్లే అంత కథ నడిచిందనే పాయింట్ మరోసారి గుర్తు చేశాడు. పుష్ప 3 ఉంటుందా అనే ప్రశ్నకు సమాధానంగా ఈసారి ఝుకేగా నహీ కాదు రుకేగా నహీ (ఆగేది లేదు) అంటూ సీక్వెల్ ఉండొచ్చనే హింట్ అయితే ఇచ్చాడు బన్నీ. గంటకు పైగా జరిగిన ఢిల్లీ ప్రెస్ మీట్ ఆద్యంతం సరదాగా గడిచిపోయింది.
This post was last modified on December 12, 2024 5:15 pm
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…
సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…
అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…
ఇండియాలో వివిధ భాషల్లో అనేక టాక్ షోలు ఉన్నాయి. అందులో అత్యంత పాపులర్ ఏది అంటే బాలీవుడ్ దర్శక నిర్మాత…