మంచు ఫ్యామిలీ గొడవ ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. తండ్రీ కొడుకులు.. అన్నదమ్ములు అంటే ఇలా ఉండాలి అన్నట్లుగా ఎంతో అన్యోన్యంగా ఉన్న మంచు కుటుంబ సభ్యుల్లో ఇప్పుడు అనూహ్యంగా విభేదాలు తలెత్తాయి. మోహన్ బాబు, విష్ణు ఒక వైపు నిలిస్తే.. మనోజ్ వారికి దూరం అయిపోయాడు. విష్ణు, మనోజ్ సవతి సోదరులు అనే విషయం జనం గుర్తించనంతగా.. ఒక కడుపునే పుట్టినంత అన్యోన్యంగా ఉండేవారు.
కానీ ఇప్పుడు మొత్తం పరిస్థితి మారిపోయింది. ఇద్దరూ శత్రువులైపోయారు. మోహన్ బాబు సైతం మనోజ్‌ను దూరం పెట్టడం.. కొడుకు మీద అనేక ఆరోపణలు చేయడం.. మనోజ్ సైతం మోహన్ బాబు-విష్ణుల మీద అభియోగాలు మోపడం చర్చనీయాంశంగా మారింది. ఈ కుటుంబం ఇలా రోడ్డున పడడం చాలామందికి నచ్చట్లేదు. మంచు ఫ్యామిలీని ట్రోల్ చేసేవాళ్లు కూడా ఈ గొడవకు ఫుల్ స్టాప్ పడాలని కోరుకుంటున్నారు. మరి ఇందుకు ఎవరు అడుగు ముందుకు వేస్తారన్నది ప్రశ్నార్థకం.
ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టగల వ్యక్తి మంచు లక్ష్మినే అన్నది చాలామంది అభిప్రాయం. మోహన్ బాబుకు ముద్దుల కూతురైన లక్ష్మి.. తన తమ్ముళ్ల మీద అమితమైన ప్రేమ చూపిస్తుంటుంది. ముఖ్యంగా మనోజ్ అంటే ఆమెకు ఎంతో ఇష్టం. విష్ణు-మనోజ్ మధ్య ఎప్పట్నుంచో వివాదం ఉండగా.. ఆ గొడవలు బయటపడకుండా లక్ష్మినే చూస్తోందనే అభిప్రాయాలున్నాయి. ఇప్పుడు కుటుంబ వ్యవహారం రోడ్డున పడి.. ఓవైపు మోహన్ బాబు-విష్ణు, మరోవైపు మనోజ్ ఇగోకు పోయి గొడవను పెద్దది చేస్తున్న నేపథ్యంలో లక్ష్మి రంగంలోకి దిగాల్సిన అవసరం కనిపిస్తోంది.
లక్ష్మి ఆ పని ఇప్పటికే చేస్తుండొంచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కానీ మీడియా కంటికి మాత్రం లక్ష్మి కనిపించడం లేదు. సోషల్ మీడియాలో మాత్రం నిన్న కూతురు నవ్వుతున్న ఫొటో పెట్టి ‘పీస్’ అనే కామెంట జోడించింది. తాజాగా ‘‘ఈ ప్రపంచంలో ఏదీ నీది కానప్పుడు ఏదో కోల్పోతావనే భయం ఎందుకు’’ అనే కోట్‌ను షేర్ చేసింది. ఐతే ఇప్పుడిలాంటి పోస్టులతో సరిపెట్టకుండా గ్రౌండ్లోకి దిగి వివాదానికి తెరదించాల్సిన అవసరముంది.
మోహన్ బాబుకైనా, మనోజ్‌కైనా నచ్చజెప్పడం ఆమె వల్లే సాధ్యం అవుతుందని.. ఆమె ఇరు వర్గాలను శాంతింపజేసి.. వివాదానికి సాధ్యమైనంత త్వరగా ముగింపు పలకాలని అభిమానులు కోరుకుంటున్నారు. మీడియాతో కూడా ఆమె మాట్లాడాల్సిన అవసరం కనిపిస్తోంది. మరి లక్ష్మి ఎప్పుడు బయటికి వస్తుందో?
This post was last modified on December 12, 2024 11:20 am
దేశీయ పారిశ్రామిక వర్గాల్లో ఇప్పుడో పెద్ద చర్చ నడుస్తోంది హెలికాఫ్టర్ల తయారీలో దిగ్గజ కంపెనీగా కొనసాగుతున్న ఎయిర్ బస్ తన కొత్త…
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…