దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కొంత విరామం తర్వాత మళ్లీ ఓ సినిమా తీయబోతున్నాడు. తన దర్శకత్వంలో 90ల్లో అద్భుత విజయం సాధించిన పెళ్ళిసందడి మ్యాజిక్‌ను రీక్రియేట్ చేయాలన్నది ఆయన ప్రయత్నం. అదే పేరుతో ఆయన తన కొత్త చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు టెక్నీషియన్లు, ప్రొడక్షన్ టీంను మాత్రమే అనౌన్స్ చేశారు రాఘవేంద్రరావు. నటీనటులు ఎవరన్నది తర్వాత వెల్లడిస్తానని ప్రకటించాడు.
ఐతే ఇందులో హీరో ఎవరనే విషయంలో ఆసక్తికర ప్రచారం సాగుతోంది. పెళ్ళిసందడి హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్‌ను ఈ సినిమాతో కథానాయకుడిగా రీలాంచ్ చేయబోతున్నట్లు సమాచారం.
రోషన్ ఇప్పటికే నిర్మలా కాన్వెంట్ సినిమాలో హీరోగా నటించాడు. ఐతే అది ఒక రకంగా చెప్పాలంటే పిల్లల సినిమా. ఆ టీనేజ్ లవ్ స్టోరీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. రోషన్ లాంచింగ్ అంత బాగా జరగలేదు. దీంతో శ్రీకాంత్ మళ్లీ తొందరపడలేదు. ఈసారి మంచి సినిమాతో కొడుకును రీలాంచ్ చేయాలని భావించాడు. అతడికి తగ్గ కథ కోసం ఎదురు చూస్తున్నాడు. అప్పుడు శ్రీకాంత్‌కు హీరోగా లైఫ్ ఇచ్చిన రాఘవేంద్రరావే.. ఇప్పుడు అతడి కొడుకును హీరోగా పెట్టి పెళ్ళిసందడి కొత్త వెర్షన్ తీయాలని భావించాడని అంటున్నారు.
సరికొత్త లుక్‌తో రోషన్ రీలాంచ్ చేయబోతున్నట్లు చెబుతున్నారు. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో.. అది నిజమే అయితే జూనియర్ శ్రీకాంత్‌ను దర్శకేంద్రుడు ఎలా ప్రెజెంట్ చేస్తాడో చూడాలి. ఈ చిత్రాన్ని రాఘవేంద్రరావుతో కలిసి శోభుయార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించనుండగా.. కీరవాణి సంగీతం సమకూర్చనున్నాడు.
This post was last modified on October 10, 2020 12:20 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…