మాములుగా ఇద్దరు పెద్ద స్టార్లు కలిసి నటించినప్పుడు స్క్రీన్ మీద చూస్తే వచ్చే కిక్కే వేరు. దీన్ని పూర్తి స్థాయిలో ఇచ్చిన సినిమా ఆర్ఆర్ఆర్. ఫుల్ లెన్త్ సాధ్యం కాదనుకుంటే జైలర్, కల్కి 2898 ఏడి లాంటివి క్యామియోలతో కన్నులపండగ చేశాయి. కానీ అన్నివేళలా ఇవి క్లిక్ అవుతాయన్న గ్యారెంటీ లేదు. రామ్ చరణ్ 16 కోసం దర్శకుడు బుచ్చిబాబు సల్మాన్ ఖాన్ కావాలని అడిగాడనే వార్త జోరుగా తిరుగుతున్న నేపథ్యంలో అభిమానులు సంతోషపడాలో టెన్షన్ పడాలో అర్థం కాని అయోమయంలో చిక్కుకున్నారు. ఎందుకంటే మెగా కాంపౌండ్ తో కండలవీరుడి కలయిక అంతగా అచ్చిరాలేదు. ఎందుకో చూడండి.
సల్మాన్ ఖాన్ చిరంజీవి గాడ్ ఫాదర్ లో చెప్పుకోదగ్గ గెస్టు రోల్ చేశాడు. ఒరిజినల్ వెర్షన్ లో పృథ్విరాజ్ సుకుమారన్ చేసిన పాత్రని ఏరికోరి మరీ సల్లు భాయ్ తో వేయించాడు దర్శకుడు మోహన్ రాజా. తీరా చూస్తే దీని వల్ల ఒరిగిందేమి లేదు. పైగా పేలవమైన ఫైట్లు, పాట వల్ల మరింత మైనస్ అయ్యింది. దీనికి కృతజ్ఞతగా కిసీకా భాయ్ కిసీకా జాన్ లో సల్మాన్ ఖాన్, వెంకటేష్ లతో కలిసి చరణ్ రెండు మూడు స్టెప్పులు వేశాడు. అది ఎంత దారుణంగా పోయిందో తెలిసిందే. కనీసం ఇలాంటి పాటొకటి ఉందని తెలిసేలోపే థియేటర్ల నుంచి మాయమైపోయింది. సో మెగా ఫ్యాన్స్ ఆలోచిస్తోంది వీటి గురించే.
ఒకవేళ చరణ్ కనక నిజంగా సల్మాన్ ని అడిగితే నో చెప్పే ప్రసక్తే ఉండదు. ఇద్దరి మధ్య అంత ఘాడమైన స్నేహం ఉంది. కాకపోతే రెండోసారి కనక అడగాలా వద్దా అని చరణే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుంటాడు. అయినా ప్రతిసారి సెంటిమెంట్లు పని చేస్తాయని కాదు కానీ పలు సందర్భాల్లో నిజామాయ్యాయి కాబట్టి ఫ్యాన్స్ ఆందోళన చెందడంలో న్యాయముంది. పెద్ది టైటిల్ పరిశీలనలో ఉన్న ఆర్సి 16 షూటింగ్ త్వరలోనే గేమ్ ఛేంజర్ ప్రమోషన్ల కోసం బ్రేక్ తీసుకోనుంది. జనవరి 10 సినిమా విడుదలయ్యాక కొద్దిరోజులు ఆగి కొత్త షెడ్యూల్ మొదలు పెడతారు. 2026 సంక్రాంతి లక్ష్యంగా షూట్ చేస్తున్నారు.
This post was last modified on December 11, 2024 6:47 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…