మంచు మోహన్ బాబు కుటుంబంలో వివాదం ఇపుడు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ గొడవలపై మంచు విష్ణు స్పందించారు. ఇటువంటి గొడవ జరగడం బాధాకరమని, అయితే ప్రతి ఇంట్లో చిన్న చిన్న గొడవలుంటాయని చెప్పారు. అయితే, తమను అతిగా ప్రేమించడమే మోహన్ బాబు చేసిన తప్పు అని అన్నారు. ఈ గొడవలు పరిష్కరించేందుకు పెద్దలు ప్రయత్నిస్తున్నారని, మీడియా దయచేసి ఈ విషయాన్ని పెద్దది చేసి చూపించవద్దని కోరారు. మీ అందరికీ ఇదో బిగ్ బాస్ షోలా ఉందని మీడియా ప్రతినిధులనుద్దేశించి విష్ణు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
నెగెటివ్ న్యూస్ కు రీచ్ ఎక్కువ ఉంటుందని విష్ణు చెప్పారు. అయితే, తమ కుటుంబ సమస్యలను తాము పరిష్కరించుకుంటామని, కాలమే అన్నిటికి సమాధానమిస్తుందని అన్నారు. తాను కన్నప్ప సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో అమెరికాలో ఉన్నానని, తాను ఇంట్లో లేని ఐదు రోజుల్లోనే ఈ గొడవలు జరిగాయని చెప్పుకొచ్చారు. మోహన్ బాబు ఉద్దేశ పూర్వకంగా రిపోర్టర్ పై దాడి చేయలేదని విష్ణు వివరణనిచ్చే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా, ఆ రిపోర్టర్ రంజిత్ కు, ఆయన కుటుంబానికి తాను అండగా ఉంటానని భరోసానిచ్చారు.
ఈ గొడవల్లో బయటివారి ప్రమేయం ఉందని, వారి వల్లే ఈ గొడవ పెద్దదైందని విష్ణు ఆరోపించారు. వారందరికీ సాయంత్రం వరకు టైం ఇస్తున్నానని, వారంతట వారే ఇందులోనుంచి తప్పుకుంటే బాగుంటుందని చెప్పారు. లేదంటే వారి పేర్లు తానే బయటపెట్టాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. తనకు తన తండ్రి మాటే వేదవాక్కు అని, ఆయన చెప్పిందే చేస్తానని అన్నారు. అందుకే, ఇంట్లోకి వచ్చిన వారిని బయటకు గెంటాల్సి వచ్చిందని అన్నారు.
అయితే, తన తమ్ముడిపై ఎప్పుడూ దాడులు చేయనని విష్ణు అన్నారు. తన సినిమా, మా అసోసియేషన్ విషయాలు తప్ప మిగతావి మాట్లాడనని చెప్పారు. ఈ రోజు 9.30కి నోటీసులిచ్చి 10.30కు హాజరు కావాలని పోలీసులు పిలిచారని, అది ఎలా సాధ్యమని విష్ణు ప్రశ్నించారు. అయితే, పోలీసులంటే తనకు గౌరవం ఉందని, వారిని తప్పకుండా కలుస్తానని చెప్పారు.
This post was last modified on December 11, 2024 3:59 pm
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
బీజేపీ మాతృ సంస్థ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్).. తాజాగా కమల నాథులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…