ఇటీవలే సిటాడెల్ హానీ బన్నీ వెబ్ సిరీస్ తో పలకరించిన సమంతా ప్రస్తుతం తుంబాడ్ సృష్టికర్తల రక్త్ బ్రహ్మాండ్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. కొత్తగా తెలుగు, హిందీలో ఎలాంటి కమిట్ మెంట్లు ఇవ్వని సామ్ తాజాగా ఇన్స్ టా లో షేర్ చేసిన ఒక స్టోరీ ఆసక్తికరంగా ఉంది. కన్య, మకర, మిథునం రాశులకు సంబంధించి కొన్ని ఫలాలు పోస్ట్ చేయడం అభిమానుల మధ్య చర్చకు దారి తీస్తోంది. మాములుగా ఎవరికైనా ఒకటే రాశి ఉంటుంది. మరి సామ్ ఇలా పని కట్టుకుని చెప్పడం వెనుక ఉద్దేశాలు ఏమై ఉంటాయోనని డిస్కస్ చేసుకుంటున్నారు. ముందు తనేమందో చూద్దాం.
“2025 నుంచి ఏం ఆశించవచ్చు. చాలా బిజీగా ఉండే ఏడాది, నువ్వున్న వృత్తిలో అభివృద్ధితో పాటు మరింత ఆదాయం, నీకు నీవాళ్లకు ఆర్ధిక స్థిరత్వం, చాలా నమ్మకమైన ప్రేమించే భాగస్వామి, రాబోయే సంవత్సరాల్లో అనుకున్న పెద్ద గోల్స్ సాధించడం, సంపాదన పెరిగే ఇతర వ్యాపకాలు, వేరోచోటికి వెళ్ళడానికి అవకాశం, మెరుగైన మానసిక శారీరక ఆరోగ్యం, తల్లి / తండ్రి కాబోయే భాగ్యం (కావాలనుకుంటే గొప్పే – ఒకవేళ వద్దనుకుంటే జాగ్రత్త సుమీ) “. చూసారుగా ఇది సమంతా ఇచ్చిన లిస్టు. వీటిలో చాలా మటుకు తనతో మ్యాచ్ అవుతాయి కానీ చివరిది మాత్రమే ఏంటబ్బా అని ఆలోచించేలా ఉంది.
మూడు రాశుల ప్రస్తావన తెచ్చింది కాబట్టి తనది మాత్రమేనా లేక ఇంకెవరినైనా ఉద్దేశించిందా అనే కోణంలో విశ్లేషణ చేస్తున్న వాళ్ళు లేకపోలేదు. నాగచైతన్య, శోభితల వివాహం జరిగిన టైంలో సామ్ ఇస్తున్న ఇంటర్వ్యూలు, పోస్టులు వైరలవుతున్నాయి. ఆ మధ్య వరుణ్ ధావన్ తో మాట్లాడుతూ ఎక్స్ కి ఖర్చు పెట్టిన కానుకలకు చాలా డబ్బయ్యిందని చెప్పడం వీడియో రూపంలో చక్కర్లు కొట్టింది. ఇప్పుడీ రాశుల ప్రస్తావన తీసుకొచ్చి ఇంకో టాపిక్ ఇచ్చింది. ఇదంతా ఓకే కానీ ఇంతకీ సమంత గతంలో ప్రకటించిన మా ఇంటి బంగారం షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో, ఎవరెవరు ఉంటారో మాత్రం చెప్పడం లేదు.
This post was last modified on December 11, 2024 11:38 am
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……