అసలు టాపిక్ లోకి వెళ్లేముందు కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళదాం. నాగార్జునకి శివ లాంటి పాత్ బ్రేకింగ్ బ్లాక్ బస్టర్ వచ్చాక కొన్నేళ్ల పాటు డిజాస్టర్లు చూడాల్సి వచ్చింది. ప్రయోగాలన్నీ బెడిసి కొట్టాయి. కమర్షియల్ దారిలోకి వచ్చాకే విజయాలు వరించాయి. అల్లూరి సీతారామరాజు తర్వాత సూపర్ స్టార్ కృష్ణకు పదమూడు ఫ్లాపులు. చిరంజీవి ఖైదీ తర్వాత మంత్రిగారి వియ్యంకుడు లాంటి మంచి సినిమాకు ఆధారణ దక్కలేదు. జూనియర్ ఆది తర్వాత అంచనాల బరువు మోయలేక యావరేజ్ లు కూడా నష్టాలు తెచ్చాయి. మగధీర తర్వాత రామ్ చరణ్ ఆరంజ్ చేస్తే జనం ఒప్పుకోలేక నో అనేశారు.
ఇలా ఎన్నో ఉదాహరణలు చెప్పుకుంటూ పోతే వస్తూనే ఉంటాయి. ఇప్పుడు వీటికి అల్లు అర్జున్ కనెక్షన్ ఎందుకనే పాయింట్ కు వద్దాం. పుష్ప 2 దెబ్బకు బన్నీ ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. తర్వాత వచ్చే ఏ సినిమా అయినా సరే బాలీవుడ్ లోనూ సమాన క్రేజ్ తెచ్చుకుంటుంది. హక్కుల కోసం నార్త్ బయ్యర్లు ఎగబడతారు. దర్శకుడు ఎవరనేది పట్టించుకోరు. జస్ట్ ఐకాన్ స్టార్ బ్రాండ్ చూసి కోట్లు కుమ్మరిస్తారు. పుష్ప హీరోగా ఉత్తరాది ఆడియన్స్ తనను స్వంతం చేసుకున్న తీరు ఏ స్థాయిలో ఉందో బోలెడు వీడియోల రూపంలో కనిపిస్తూనే ఉంది. ఇది అంతకంత పెరగడమే తప్ప తగ్గడం ఉండదు.
కానీ బన్నీ ఈ విషయంలో అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నెక్స్ట్ లైన్ లో ఉన్నది త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా. నిర్మాత నాగవంశీ చెప్పిందాన్ని బట్టి చూస్తే ఇది ఆషామాషీగా ఉండబోవడం లేదు. అందులోనూ హీరో దర్శకుడి బ్లాక్ బస్టర్ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతోంది. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగాది ఉండాలి. దీనికి సంబంధించి ఎప్పుడో వచ్చిన అనౌన్స్ మెంట్ తప్ప మళ్ళీ అప్డేట్ లేదు. ఒకవేళ నిజమైతే మాత్రం ‘యానిమల్ డైరెక్టర్ విత్ పుష్ప హీరో’ అనే ట్యాగ్ లైనే రెండు వేల కోట్లతో సమానం. సో గత ట్రాక్ రికార్డు దృష్ట్యా ఫ్యాన్స్ టెన్షన్ పడాల్సిన అవసరం లేనట్టే.
This post was last modified on December 10, 2024 1:56 pm
తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…
హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…
చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…
కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…
రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…
దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…