ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘పుష్ప: ది రూల్’ ఎలా ప్రభంజనం సాగిస్తోందో తెలిసిందే. ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఆ సినిమా జోరు మామూలుగా లేదు. రూరల్, మాస్ ఏరియాల్లో హిందీ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఊగిపోతున్నారు. ఈ సినిమాకు రిలీజ్ ముంగిట హిందీలో జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్.. బీహార్‌లోని పాట్నాలో నిర్వహించిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చిన స్పందన చూస్తేనే కలెక్షన్ల మోత మోగిపోనుందని అర్థమైంది. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే నార్త్ ఇండియాలో అలాంటి ఈవెంట్ ఒకటి జరగలేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
పొలిటికల్ మీటింగ్‌లను మించేలా ఆ వేడుకకు స్పందన వచ్చింది. అల్లు అర్జున్ నార్త్ ఫాలోయింగ్ చూసి మిగతా హీరోలకు కళ్లు కుట్టి ఉంటాయేమో అన్న చర్చ జరిగిందప్పుడు. ఐతే బీహార్ ఈవెంట్ మీద తమిళ హీరో సిద్ధార్థ్ తాజాగా వేసిన పంచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతోంది.‘పుష్ప-2’ రిలీజైన వారానికే సిద్ధు సినిమా ‘మిస్ యు’ విడుదల కాబోతోంది. ఐతే బన్నీ సినిమా ప్రభంజనం కొనసాగిస్తుండగా.. ‘మిస్ యు’ ఏ మాత్రం ప్రభావం చూపిస్తుందో అన్న సందేహాలున్నాయి.
ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో పుష్ప-2 గురించి ప్రస్తావిస్తూ, పాట్నాలో ఆ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చిన జనాన్ని చూశారా అని అడిగారు. దీనికి సిద్ధు సెటైరిగ్గా స్పందించాడు. మన దగ్గర కన్‌స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంటే జేసీబీ సౌండ్ వినిపించినా జనం గుమిగూడి చూస్తారని.. ఇండియాలో జనాన్ని సమీకరించడం పెద్ద విషయం కాదని సిద్ధు అన్నాడు. జనం వస్తే సక్సెస్ అంటే.. ప్రతి పొలిటికల్ పార్టీ మీటింగ్‌లోేనూ జనం ఉంటారని.. మరి వాళ్లందరూ గెలిచేస్తున్నారా అని సిద్ధు అన్నాడు. రాజకీయ సభలకు జనం వస్తే బీరు-బిరియాని వల్లే అని తాము మాట్లాడుకునేవాళ్లమని.. ఇండియాలో దేనికైనా జనం వస్తారని.. జనం గుమికూడడం చాలా చిన్న విషయమని సిద్ధు వ్యాఖ్యానించాడు.
‘పుష్ప-2’ రిలీజవ్వడానికి వారం ముందే ‘మిస్ యు’ రావాల్సింది. అప్పుడు పుష్ప-2 వస్తే తట్టుకోగలరా అని అడిగితే.. తమ సినిమాలో కంటెంట్ ఉందని, భయపడితే పుష్ప-2 టీమే భయపడాలన్నట్లుగా మాట్లాడాడు సిద్ధు. కానీ తీరా చూస్తే వర్షాల పేరు చెప్పి ‘మిస్ యు’ మూవీని వాయిదా వేసేశారు. ఇప్పుడు కూడా పుష్ప-2 ప్రభంజనం గురించి అడిగితే.. సిద్ధు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడంటూ అతడి మీద సోషల్ మీడియాలో కౌంటర్లు పడుతున్నాయి.
This post was last modified on December 10, 2024 10:46 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…