అల్లరి నరేష్ హీరోగా రూపొందిన బచ్చల మల్లి ఈ నెల 20 విడుదలకు రెడీ అవుతోంది. రిలీజ్ కు ఇంకో పన్నెండు రోజులు మాత్రమే ఉండటంతో టీమ్ ప్రమోషన్లు పెంచింది. అందులో భాగంగా ఇవాళ తుని పట్టణం రాజా గ్రౌండ్ లో ట్రాక్టర్ల మధ్య టగ్ అఫ్ వార్ పోటీ ఏర్పాటు చేసింది. అంటే ఇరువైపులా ట్రాక్టర్ బళ్లను బలమైన తాళ్లతో కట్టి ఎవరు బలంగా తమవైపు లాక్కుంటారో వాళ్లదే గెలుపన్న మాట. మాములుగా అయితే ఇదే పద్ధతి. బచ్చల మల్లి టీమ్ ఏమైనా వెరైటీగా చేస్తుందేమో చూడాలి. విన్నర్లకు 50 వేల రూపాయల బహుమతి ఉంటుంది. పెద్ద ఎత్తున పబ్లిక్ వస్తున్నందున భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇలా చేయడానికి కారణం బచ్చల మల్లిలో టైటిల్ రోల్ చేస్తున్న అల్లరి నరేష్ ట్రాక్టర్ డ్రైవర్ కావడమే. ఫుల్ మాస్ టచ్ ఒక ఎమోషనల్ లవ్ స్టోరీని తీసినట్టు దర్శకుడు సుబ్బు చెప్పడం బట్టి చూస్తే కంటెంట్ ఏదో డిఫరెంట్ గా ఉండబోతోందని అర్థమవుతోంది. ట్రైలర్ లో అల్లరోడు మాములు మాస్ గా లేడు. ఒకరకంగా చెప్పాలంటే పుష్ప షేడ్స్ కనిపించాయి. ఎవరూ ఊహించని క్లైమాక్స్ చాలా కాలం వెంటాడటం ఖాయమని అంతర్గతంగా వినిపిస్తున్న మాట. సో ఇవి కనక నిజమైతే నాంది తర్వాత అల్లరి నరేష్ కు మరో సోలో సీరియస్ హిట్టు పడ్డట్టే. అమృత అయ్యర్ ఇందులో హీరోయిన్ గా నటించింది.
జనాన్ని ఆకట్టుకోవాలంటే పబ్లిసిటీలో ఇలాంటి కొత్త పుంతలు తొక్కక తప్పదు. అసలే బచ్చల మల్లికి విపరీతమైన పోటీ ఉంది. పుష్ప 2 ది రూల్ జోరు అప్పటికి తగ్గేలా లేదు. విడుదల పార్ట్ 2, యుఐ, సారంగపాణి జాతకం, ముఫాసా లయన్ కింగ్, రాబిన్ హుడ్, మ్యాక్స్ ఇలా పెద్ద కాంపిటీషనే ఉంది. పైగా అప్పటి నుంచి మూడు వారాలు దాటడం ఆలస్యం సంక్రాంతి సినిమాల హడావిడి మొదలైపోతుంది. సో బచ్చల మల్లి హిట్టు టాక్ తెచ్చుకున్నా ఇరవై రోజులలోపే మొత్తం రాబట్టాలి. కామెడీ మళ్ళీ ట్రై చేద్దామని అల్లరి నరేష్ ఎంచుకున్న ఆ ఒక్కటి అడక్కు ఫ్లాప్ అయ్యింది. అందుకే బచ్చల మల్లి మీదే ఆశలు పెట్టుకున్నాడు.
This post was last modified on December 9, 2024 12:14 pm
సంధ్య థియేటర్ ఘటన నుంచి క్రమంగా బయటపడుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమాల ప్రపంచంలోకి వచ్చేస్తున్నాడు. పుష్ప 3 ఉంటుందో…
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అభిమానుల నుంచి తిప్పలు మామూలుగా ఉండడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా..…
ఏపీలోని కూటమి ప్రభుత్వం తనకు భయపడుతోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు భయపడుతున్న…
ఏపీ రాజకీయాల్లో ఉప్పు-నిప్పుగా వ్యవహరించే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌లు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చి ఆయన పాదాల చెంత తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు…
ఒక హీరో దర్శకత్వం వహించి నిర్మించడమంటే మాములు విషయం కాదు. ఒకప్పుడు ఎన్టీఆర్, కృష్ణ లాంటి లెజెండ్స్ దీన్ని సమర్ధవంతంగా…