బీహార్ నుంచి ముంబై దాకా, రాజస్థాన్ నుంచి ఆగ్రా దాకా ఎక్కడ చూసినా ఒకటే సీన్. గత నాలుగు రోజులుగా పుష్ప 2 ది రూల్ థియేటర్లు ఎక్కడ హౌస్ ఫుల్ కాలేదని వెతికితే సమాధానం దొరకడం లేదు. టికెట్ ముక్క దొరికితే ఒట్టు అనేలా నార్త్ లో పుష్పరాజ్ భీభత్సం మాములుగా లేదు. ప్రాధమిక అంచనాల మేరకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నిన్న నాలుగో రోజు 80 కోట్లకు పైగా నెట్ సాధించిన బాలీవుడ్ మూవీగా పుష్ప 2 సంచలనం సృష్టించబోతోంది. అందులోనూ ఒక డబ్బింగ్ మూవీ ఈ స్థాయిలో అరాచకం చేస్తుందని ఎవరూ ఊహించలేదు. ఎక్కడా చూసినా ర్యాంపేజ్ అనే మాట చిన్నదే అనిపిస్తోంది.
బుక్ మై షోలో సోమవారం నుంచి వీక్ డేస్ అయినప్పటికీ గంటకు సగటున 3 నుంచి 5 వేల మధ్యలో టికెట్లు అమ్ముడుపోతూనే ఉన్నాయి. సాధారణంగా ఎంత మొదటి వారమైనా సరే డ్రాప్ ఉండటం సహజం. కానీ పుష్ప 2 రివర్స్ లో వెళ్తోంది. గురువారం నుంచి ఆదివారం దాకా టికెట్లు దొరక్క చూడలేకపోయినవాళ్ళు వీలైనంత త్వరగా చూసేందుకు ఎగబడుతున్నారు. ప్రసిద్ధ గెయిటీ గెలాక్సీ థియేటర్ బయట 250 మీటర్ల వరకు టికెట్ కౌంటర్ దగ్గర క్యూ లైన్ ఉందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సోల్డ్ అవుట్ బోర్డ్ ఉన్నా సరే మరుసటి రోజు షోలకు ఎగబడుతున్న వీడియోలు వైరలవుతున్నాయి.
ముంబైలో చాలా చోట్ల అర్ధరాత్రి షోలకు ఇదే రెస్పాన్స్ కనిపించింది. ఒంటి గంటకు మొదలుపెడితే నాలుగు గంటలకు బయటికొచ్చే సమయంలోనూ ప్రేక్షకులు పుష్ప 2 కోసం ఫ్యామిలీస్ తో వెళ్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అనుమతులు లేవు కాబట్టి ఈ సీన్ చూడలేం కానీ ఉత్తరాది నగరాల్లో కనిపించడం టాలీవుడ్ స్థాయి పెరిగిందనడానికి నిదర్శనం. ఒక్క హిందీ వెర్షన్ నుంచే పుష్ప 2 ఎంతలేదన్నా 700 కోట్లను దాటేస్తుందనే అభిప్రాయం నిజమయ్యేలా ఉంది. అంతకు మించి రాబట్టినా వెయ్యి కోట్లకు చేరుకున్నా ఎంత మాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇంకో పది రోజులు ఈ తుఫాను శాంతించేలా లేదు.
This post was last modified on December 9, 2024 2:23 pm
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…