Movie News

రాఘవేంద్రరావుది పెద్ద రిస్కే..

మూడేళ్ల కిందట ‘ఓం నమో వేంకటేశాయ’తో చేదు అనుభవం ఎదుర్కొన్న లెజెండరీ డైరెక్టర్ రాఘవేంద్రరావు.. అప్పట్నుంచి సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. మధ్యతో తన నిర్మాణంలో నాగశౌర్య, క్రిష్ తదితరుల కలయికలో ఓ సినిమాను ప్రొడ్యూస్ చేసేందుకు సన్నాహాలు చేశారు కానీ.. అదెందుకో వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత మళ్లీ గ్యాప్ వచ్చింది. ఐతే తన నుంచి రాబోయే కొత్త సినిమా గురించి ప్రకటన రాబోతోందంటూ రెండు రోజుల కిందట ఆయన అప్‌డేట్ ఇచ్చారు.

ఇంతకుముందు బ్రేక్ పడ్డ ప్రాజెక్టునే మళ్లీ మొదలుపెట్టబోతున్నారా.. లేక కొత్తదా అని అందరూ చూశారు. ఇది కొత్తదే. కాకపోతే ఓ పాత బ్లాక్‌బస్టర్ మూవీని రిక్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు దర్శకేంద్రుడు. 90ల్లో సంచలన విజయం సాధించిన ‘పెళ్లిసందడి’ పేరుతోనే మళ్లీ సంగీత ప్రధానంగా ఓ సినిమా చేయడానికి రాఘవేంద్రరావు రంగం సిద్ధం చేశారు.

తన ఆధ్వర్యంలో రాబోయే ‘కొత్త పెళ్ళిసందడి’ గురించి రాఘవేంద్రరావు ఒక వీడియో అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమాకు రాఘవేంద్రరావు దర్శకత్వం వహిస్తాడా లేదా అన్నది అందులో స్పష్టత ఇవ్వలేదు. ఐతే ఈ సినిమాలో భాగం కాబోయే టెక్నీషియన్, ప్రొడక్షన్ టీంను మాత్రం రాఘవేంద్రరావు ప్రకటించారు. రాఘవేంద్రరావు ఆస్థాన సంగీత దర్శకుడైన కీరవాణే ఈ చిత్రానికి సంగీతం సమకూర్చనుండగా.. ఆయన ఫేవరెట్ లిరిసిస్ట్ చంద్రబోస్ సాహిత్యం అందించనున్నారు. ఇక ‘ఆర్కా మీడియా’ అధినేతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఇందులో నిర్మాణ భాగస్వాములు. కీరవాణి తండ్రి, రచయిత శివశక్తి దత్తాతో పాటు మరో రైటర్ శ్రీధర్ సీపాన పేరు కూడా ఇందులో వేశారు. బహుశా వీరిలో ఒకరు కథ, మరొకరు మాటలు అందిస్తుండొచ్చు. ఇవి కాక తెలిసిన పేర్లు లేవు.

ఈ చిత్రానికి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించడమో లేక పర్యవేక్షణ చేపట్టడమో చేయొచ్చు. ఏం చేసినా సరే.. ‘పెళ్ళిసందడి’ లాంటి క్లాసిక్‌ను రీక్రియేట్ చేయడం అంత సులువు కాదు. పైగా అలాంటి సినిమాను ఇప్పుడే మాత్రం ఆదరిస్తారన్నది సందేహం. పైగా శివశక్తి దత్తా, శ్రీధర్ సీపాన లాంటి రైటర్లు ప్రస్తుత ట్రెండుకు సెట్ అయ్యేవాళ్లు కాదు. మరి వీరి సహకారంతో దర్శకేంద్రుడు ఎంత ట్రెండీగా సినిమా తీయగలరన్నది సందేహం. చూస్తుంటే రాఘవేంద్రరావు పెద్ద రిస్కే చేయబోతున్నట్లు కనిపిస్తోంది.

This post was last modified on October 9, 2020 4:19 pm

Share

Recent Posts

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

53 minutes ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

6 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

7 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

7 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

7 hours ago

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

10 hours ago