మూడు రోజులకే పుష్ప 2 ది రూల్ ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల గ్రాస్ దాటేయడం గురించి ఫ్యాన్స్ తెగ చెప్పుకుంటున్నారు కానీ ఈ సినిమా ర్యాంపేజ్ చూస్తుంటే ఇది చాలా చిన్న మ్యాటరనిపిస్తుంది. ఎందుకంటే ఒక్క హిందీ వెర్షన్ నుంచే అంతకన్నా ఎక్కువ వస్తుందని బాలీవుడ్ ట్రేడ్ పండితులు బల్లగుద్ది చెబుతున్నారు. ఒకవేళ ఎనిమిది వందల కోట్ల మార్కు దాటినా ఎంత మాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ అంచనాలకు తగ్గట్టే నార్త్ లో ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. ముంబైలో నాలుగో రోజు అర్ధరాత్రి షోలు వేసినా టికెట్లు దొరక్కపోవడం ఏపీ తెలంగాణలో సైతం లేదు.
ఈ లెక్కన అన్ని భాషలు కలిపి వెయ్యి కోట్లు దాటేయడం కేవలం లాంఛనం మాత్రమే. సోమవారం నుంచి రెగ్యులర్ రేట్లే ఉంటాయని వినిపిస్తున్న నేపథ్యంలో మన దగ్గర పుష్ప 2 అమాంతం రైజ్ అయ్యేలా ఉంది. వీకెండ్ కాబట్టి అన్ని చోట్ల సోల్డ్ అవుట్ సిచువేషన్ ఉంది కానీ రేపటి నుంచి ఇదే జోరు ఆశించలేం. వంద రెండు వందల రూపాయల పెంపు ఉండటంతో సామాన్య ప్రేక్షకులు ఇంకా వెయిటింగ్ మోడ్ లోనే ఉన్నారు. సో సీడెడ్ నుంచి నైజామ్ దాకా మాములు ధరలు ఉంటే మాత్రం సులభంగా మరో పది రోజులు పుష్ప 2 ది రూల్ అరాచకాన్ని చూడొచ్చు. ఊహకందని నెంబర్లు వస్తాయి.
ఓవర్సీస్ లోనూ పదకొండు మిలియన్ల మార్క్ దాటేసిన బన్నీ ఫైనల్ గా ఎక్కడ ఆగుతాడో చెప్పలేనంత జోరుగా దూకుడు కొనగిస్తున్నాడు. ముఖ్యంగా నైజామ్ లో వస్తున్న వసూళ్ల హోరుకు డిస్ట్రిబ్యూటర్ల నోట మాట రావడం లేదు. రిలీజ్ కు ముందు ఒక కమర్షియల్ మాస్ సినిమా వెయ్యి కోట్లు చేయడం గురించి ఎంతో మంది అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ వాటిని పటాపంచలు చేస్తూ అల్లు అర్జున్, సుకుమార్ టీమ్ కలిసి సృష్టించిన మాస్ మాయాజాలం బాక్సాఫీస్ ని దాసోహం అనేలా చేసింది. రేపు వచ్చే కలెక్షన్ల ఫిగర్స్ ఎందరికో మతులు పోగొట్టి నిద్రలు దూరం చేయడం పక్కా. పుష్ప 2 తగ్గేదేలే అంటున్నాడు మరి.
This post was last modified on December 8, 2024 2:26 pm
తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం భక్తులు భారీగా తరలివచ్చి జరిగిన తొక్కిసలాటతో చోటుచేసుకున్న విషాదం యావత్ దేశాన్ని…
తలా అని అభిమానులు ప్రేమగా పిలుచుకునే అజిత్ ఏడాదికి ఒక సినిమా చేయడమే మహా గగనం. అలాంటిది కేవలం మూడు…
జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్ సమస్యలు భారత క్రికెట్లో కీలక చర్చకు కారణమవుతున్నాయి. ఇటీవల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా వెన్నునొప్పితో ఇబ్బందులు…
తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన…
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకోవాలన్న కోటి ఆశలతో వచ్చి ప్రాణాలు కోల్పోయిన వారిని తలచుకుంటేనే కన్నీళ్లు…
కొత్త సినిమాల రిలీజ్ సందర్భంగా ప్రదర్శిస్తున్న ప్రీమియర్ షోలను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టిన సందర్భంగా…