Movie News

కేరళలో మల్లు అర్జున్ పవర్ ఏమైంది?

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్‌కు కేరళలో ఉన్న ఫాలోయింగ్ ఎలాంటిదో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ‘హ్యాపీ’ లాంటి ఫ్లాప్ సినిమాను మలయాళంలో డబ్ చేసి రిలీజ్ చేస్తే సూపర్ హిట్టయి అతడికి అక్కడ మంచి ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. తర్వాత చాలా సినిమాలు అక్కడ మంచి వసూళ్లు సాధించాయి. మాలీవుడ్ స్టార్లతో సమానంగా అక్కడ ఫాలోయింగ్ సంపాదించాడు బన్నీ. అతడి చివరి సినిమా ‘పుష్ప’ కూడా మలయాళంలో చాలా బాగా ఆడింది.

దీంతో ‘పుష్ప-2’ మీద భారీగా అంచనాలు నెలకొన్నాయి. బన్నీ కూడా ఈ చిత్రాన్ని అక్కడ బాగా ప్రమోట్ చేశాడు. ‘పీలింగ్స్’ పాటలో మలయాళంలో లిరిక్స్‌ పెట్టి అక్కడి వాళ్లను మరింత ఇంప్రెస్ చేశాడు. ప్రమోషన్ల టైంలో కేరళలో తన గడ్డ అని చెబుతూ.. తాను ఆ రాష్ట్రానికి దత్త పుత్రుడినని పేర్కొన్నాడు. ఈ సినిమాకు అక్కడున్న హైప్ చూసి డిస్ట్రిబ్యూటర్ కూడా భారీ వసూళ్లు ఖాయమని ధీమా వ్యక్తం చేశాడు.

పర భాషా చిత్రాల్లో ‘లియో’ కేరళలో నెలకొల్పిన కలెక్షన్ల రికార్డును ‘పుష్ప-2’తో బద్దలు కొడతామని ధీమా వ్యక్తం చేశాడు.కానీ ‘పుష్ప-2’ సినిమా కేరళలో అనుకున్నంతగా ప్రభావం చూపట్లేదు. తొలి రోజు ఈజీగా పది కోట్ల గ్రాస్ మార్కును దాటేస్తుందని అంచనా వేస్తే.. రూ.6 కోట్ల వసూళ్లే వచ్చాయి. రెండో రోజు వసూళ్లు సగానికి పడిపోయాయి. సినిమాకు మామూలుగా డివైడ్ టాక్ ఉండగా.. కేరళలో ఇంకొంచెం ఎక్కువ నెగెటివ్ టాక్ వచ్చింది.

మలయాళ ప్రేక్షకులు కొంచెం సున్నితంగా ఉంటారు. అక్కడి సినిమాలూ అంతా. వాళ్లకు మరీ ఇంత మాస్ కంటెంట్ ఇచ్చేసరికి సానుకూల స్పందన కనిపించట్లేదు. హిందీ రూరల్ ఆడియన్సుని, తెలుగు ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని సినిమాను ఊర మాస్‌గా తీర్చిదిద్దారు. కానీ మలయాళీలకు ఇది రుచిస్తున్నట్లు కనిపించడం లేదు. ఫాహద్ ఫాజిల్ పాత్రను ప్రెజెంట్ చేసిన తీరు కూడా వాళ్లకు నచ్చుతున్నట్లు లేదు. దీంతో ఓపెనింగ్స్‌లోనే ‘పుష్ప-2’ వెనుకబడింది. ‘లియో’ మలయాళంలో రూ.60 కోట్ల దాకా వసూళ్లు రాబట్టగా.. ‘పుష్ప-2’ అందులో సగం కలెక్ట్ చేయడం కూడా సందేహంగానే ఉంది.

This post was last modified on December 8, 2024 9:16 am

Share

Recent Posts

వందేమాత‌రంపై కేంద్రానికి సుప్రీంకోర్టు షాక్‌?

జాతీయ గేయం వందేమాత‌రం వ్య‌వ‌హారంపై జ‌రుగుతున్న వివాదాలు అన్నీ ఇన్నీ కావు. దేశానికి స్వాతంత్రం రాక మునుపు నుంచి ఈ…

46 minutes ago

కలెక్షన్ కింగ్ అందుకే వెనుక ఉన్నారా

ఒకప్పుడు కలెక్షన్ కింగ్ గా తొంభై దశకంలో స్టార్ హీరోలకు బలమైన పోటీ ఇచ్చిన మోహన్ బాబుకి ఇప్పటికీ ఫాలోయింగ్…

2 hours ago

జడల్ జమానాకు సెన్సార్ ట్విస్టులు

ప్యారడైజ్ సెన్సార్ అయిపోయింది. ఊహించినట్టే ఏ సర్టిఫికెట్ వచ్చింది. 2 గంటల 54 నిమిషాల సవారి జాతి ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు…

3 hours ago

ఇక పిఠాపురంలోనే పవన్ మకాం?

చాలా రోజుల తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కనిపించారు. ప్రకృతి వైద్యం కోసం కేరళం వెళ్లి 20 రోజుల…

3 hours ago

టీమిండియాకు చెమటలు పట్టించిన జపాన్

జపాన్‌తో మ్యాచ్ అంటే టీమిండియా సులభంగా గెలుస్తుందని అనుకున్నారు క్రికెట్ ఫ్యాన్స్. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తడి…

3 hours ago

మేయ‌ర్ స్థానాల‌పై ప‌ట్టు.. జ‌న‌సేన వ్యూహ‌మేంటి.. ?

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన మేయర్ స్థానాలపై జనసేన పార్టీ గట్టి పట్టు సాధించాలని వ్యూహరచన చేస్తోంది. కూటమి…

4 hours ago