ఆన్ లైన్ లో పవన్ కళ్యాణ్ అభిమానులకు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు మధ్య నంద్యాల పర్యటన నుంచి జరుగుతున్న ఆన్ లైన్ రచ్చ గురించి తెలిసిందే. తమ మధ్య ఏం లేదని అంతర్గతంగా వాళ్ళ కుటుంబ సభ్యులు చెబుతున్నా సరే సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంది. అసలు పుష్ప 2 లో లేని డైలాగులను సృష్టించి బాస్ అంటూ, తమ్ముడు అంటూ ఏవేవో ఫేక్ ప్రచారాలు తీసుకొచ్చారు. ఇది ఎంత స్థాయికి వెళ్లిందంటే ఒక పేరున్న న్యూస్ ఛానల్ ఈ అబద్దపు వైరల్ వార్తను తీసుకుని ఏకంగా డిబేట్ కూడా పెట్టేసింది. కానీ పుష్ప 2 సక్సెస్ ప్రెస్ మీట్ లో వీటికి చెక్ పెట్టే ప్రయత్నం జరిగింది.
తెలంగాణలో ఇచ్చినట్టుగా ఆంధ్రప్రదేశ్ లో ఏ మాత్రం తగ్గకుండా అంతే టికెట్ రేట్లు పెంపు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి కృతజ్ఞతలు చెప్పిన బన్నీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ తీసుకున్న చొరవ, పుష్ప 2కి ప్రత్యేక ధరలు రావడంలో ప్రధాన కారణం పవన్ అయినందుకు ధన్యవాదాలు తెలిపాడు. వ్యక్తిగతంగా మాట్లాడుతున్నానని చెబుతూ కళ్యాణ్ బాబాయ్ థాంక్ యు సో మచ్ అనడంతో ప్రాంగణం ఒక్కసారిగా చప్పట్లతో మారుమ్రోగిపోయింది. తన ప్రసంగంలో ఉపముఖ్యమంత్రిగా అడ్రెస్ చేశాక తిరిగి కళ్యాణ్ బాబాయ్ అంటూ ప్రత్యేకంగా మాట్లాడ్డం ఆకట్టుకుంది.
అంతకు ముందు నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ తమ సినిమా మీద ఆసక్తితో పెంపు ఇచ్చినందుకు పవన్ తో పాటు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కు థాంక్స్ చెప్పారు. పుష్ప 2కి ఇచ్చిన టికెట్ రేట్ల పెంపు రెండు రాష్ట్రాలపరంగా ఇతర నిర్మాతలకు బోలెడంత ధైర్యాన్ని ఇచ్చింది. కల్కి, దేవరలాంటివి కూడా హైక్ తీసుకున్నప్పటికీ బ్లాక్ బస్టర్ కంటెంట్ ఉంటే బడ్జెట్ కు తగ్గట్టు పెంపు తెచ్చుకుంటే ప్రేక్షకులు చూస్తారని పుష్ప 2 ఋజువు చేసింది. రాబోయే సంక్రాంతి రిలీజులకు ఈ పరిణామం చాలా కీలకం కానుంది. ఇంత ఓపెన్ గా బన్నీ పవన్ కళ్యాణ్ మీద అభిమానం చూపించాడు కాబట్టి ఫ్యాన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.
This post was last modified on December 7, 2024 8:00 pm
అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పటికే కొలువుల కోత మొదలుకాగా… త్వరలోనే హెల్త్ ఎమర్జెన్సీ తలెత్తినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని చెప్పాలి. ఎందుకంటే..…
ఏపీ రాజధాని అమరావతికి సంబంధించిన కీలక నిర్ణయం తెరమీదికి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ఓ ప్రకటన చేసింది.…
వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి రిమాండ్ పొడిగిస్తూ.. విజయవాడ కోర్టు తీర్పు చెప్పింది. ఇప్పటికే ఆయన…
ఐపీఎల్లో రికార్డు స్థాయిలో ఐదు ట్రోఫీలు గెలిచిన జట్టు ముంబయి ఇండియన్స్. కానీ ఈ సీజన్లో పేలవ ప్రదర్శన చేస్తోంది.…
డైలాగ్ కింగ్ మంచు మోహన్బాబు ఇంట్లో ఇటీవల కాలంలో పలు రగడలు తెరమీదికి వస్తున్న విషయం తెలిసిందే. ఆస్తుల వివాదాలు…
మొదటిసారి విడుదలైనప్పుడు ఫ్లాప్ అనిపించుకుని ఏళ్ళు గడిచేకొద్దీ కల్ట్ ముద్రతో రీ రిలీజులు సూపర్ హిట్ కావడం ఈ మధ్య…