పుష్ప 2 ది రూల్ ని ఉత్తరాది ప్రేక్షకులు పూర్తిగా ఓన్ చేసుకున్నారు. ఎంతగా అంటే మొదటి రోజు ఓపెనింగ్ ఏకంగా షారుఖ్ ఖాన్ రికార్డుని బద్దలు కొట్టేంత. మాములుగా డబ్బింగ్ చిత్రాలకు ఆదరణ తక్కువగా ఉండే రాష్ట్రాల్లోనూ ఈ ప్యాన్ ఇండియా మూవీ సృష్టిస్తున్న భీభత్సం చూసి బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్ల సంతోషానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. ఒక నాన్ ప్రభాస్ అందులోనూ రాజమౌళి దర్శకత్వం వహించని ఒక కమర్షియల్ బొమ్మ ఈ స్థాయిలో ర్యాంపేజ్ చేయడం బహుశా ఇదే మొదటిసారని చెప్పాలి. ఇంతగా పుష్పరాజ్ ని తమ గుండెల్లో పెట్టుకోవడానికి దోహదం చేసిన అయిదు కారణాలేంటో చూద్దాం.
మొదటిది కమర్షియల్ ఫ్లేవర్. గత కొన్నేళ్లుగా బాలీవుడ్ మేకర్స్ ఎక్కువగా అర్బన్ ఆడియన్స్, ఓటిటిలను దృష్టిలో పెట్టుకుని కథలు రాస్తున్నారు. సింగం అగైన్ లాంటి ఒకటి రెండు ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ వాటిలో మాస్ ని పూర్తిగా మెప్పించే అంశాలు, డెప్త్ లేక రికార్డులు సాధించలేకపోయాయి. దీనివల్లే దెయ్యాలకు బ్రహ్మరథం పట్టాల్సిన పరిస్థితి. లేదంటే స్త్రీ 2, ముంజ్యా సక్సెసయ్యేవి కాదు. రెండో కారణం పుష్పరాజ్ నేపథ్యం. ఊర మాస్ సెటప్, ఎవడిని లెక్క చేయని మనస్తత్వం, భార్య అడిగిందని వందల కోట్లు ఖర్చు పెట్టే తెగింపు, వ్యవస్థనే సవాల్ చేసే పొగరు ఈ లక్షణాలు నార్త్ జనాలకు గూస్ బంప్స్ ఇచ్చాయి.
మూడో కారణం నేటివిటీ. చిత్తూరు సైడ్ గ్రామదేవత గంగమ్మ జాతరను అందరికీ కనెక్ట్ అయ్యేలా సుకుమార్ ఆ ఎపిసోడ్ మొత్తాన్ని మలచిన వైనం అరగంటకు పైగా థియేటర్లో కూర్చున్న వాళ్ళను రెప్ప వేయనివ్వలేదు. నాలుగో కారణం సంగీతం. దేవిశ్రీప్రసాద్ పాటలు, సామ్ సిఎస్ తో పాటు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ డాల్బీ అట్మోస్ తెరలను షేక్ చేశాయి. అయిదోది అసలు కారణమైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. జాతర, క్లైమాక్స్, పోలీస్ స్టేషన్ ఈ మూడింటిని ఇదే స్థాయిలో ఇంకో హీరో ఎవరినైనా పెర్ఫార్మ్ చేయమంటే ఒకటి రెండు పేర్లు తప్ప ఇంకేవి వినిపించవు. తగ్గేదేలే మ్యానరిజం తనకు మాత్రమే సూటయ్యింది. ఇంత యునానిమస్ అనిపించుకుంది కాబట్టే ముంబై, పాట్నా, లక్నో అనే తేడా లేకుండా పుష్ప 2 కోసం ఎగబడుతున్నారు.
This post was last modified on December 7, 2024 3:02 pm
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు చేయడం తనకు కొత్త కాదని, ఎన్నికల్లో పోటీ చేయడం…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…