పొరుగింటి పుల్లకూర రుచి అని పెద్దలు ఊరికే అనలేదు. మనింట్లో పదార్థాలు ఎంత కమ్మగా ఉన్నా పక్కింటోళ్ళు ఏమైనా ఇస్తే మాత్రం అదో అమృతంగా ఫీలయ్యే వాళ్ళు మన చుట్టూ బోలెడుంటారు. ఇది సినిమాలకూ వర్తిస్తుంది. ఎలాగో మీరే చూడండి. హాలీవుడ్ కల్ట్ మూవీ ఇంటర్ స్టెల్లార్ పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డిసెంబర్ 6 ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకంగా ఐమాక్స్ స్క్రీన్లలో రీ రిలీజ్ చేశారు. కానీ ఇండియాలో జరగలేదు. పుష్ప 2 ది రూల్ కోసం అన్ని తెరలను ముందే రిజర్వ్ చేయడంతో ఇంటర్ స్టెల్లార్ కి చోటు దక్కలేదు. దీంతో మన దేశంలో వాయిదా వేయక తప్పలేదు.
ఇది కొందరు మేధావులైన మూవీ లవర్స్ కి కోపం తెప్పించింది. అదేంటి ఇంటర్ స్టెల్లార్ ని నిర్లక్ష్యం చేసినందుకు ఇండియాకి సినిమా తీసే అర్హత లేదనే స్థాయిలో ఒక పేరున్న మీమ్ పేజీ పోస్ట్ చేసింది. ఇది కాస్తా జాన్వీ కపూర్ కంటబడింది. వెంటనే బలమైన పంచు వేసింది. పుష్ప 2 కూడా సినిమానే, వెస్ట్ ని పొగడాలనే ఉద్దేశంతో మనల్ని మనం మనం తక్కువ చేసుకోవడం ఎందుకు, ఇతర దేశాలు మన క్రియేటివిటీని మెచ్చుకుంటూ, మేకింగ్ పట్ల నిబద్దతను మెచ్చుకుంటూ ఉంటే మనం మాత్రం ఇలా కామెంట్స్ చేయడం ఎంత మాత్రం సబబు కాదని విచారం వ్యక్తం చేస్తూ కౌంటర్ వేసింది.
దెబ్బకు దేవర హీరోయిన్ కు నెటిజెన్ల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. అమ్మడు చెప్పిన దాంట్లో నిజముంది మరి. ఆర్ఆర్ఆర్ ని జపాన్ జనాలు నెత్తిన బెట్టుకున్నారు. ఆస్కార్ ఏకంగా నాటునాటు పాటకు పురస్కారం ఇచ్చింది. కల్కి 2898 ఏడి, దేవర, జైలర్, బాహుబలి లాంటివన్నీ ఓవర్సీస్ లోనూ బ్రహ్మాండంగా ఆడినవే. మహారాజ చైనాలో ఆల్ టైం రికార్డులు సృష్టించి అమీర్ ఖాన్ దంగల్ ని వెనకేసే పనిలో ఉంది. అలాంటప్పుడు ఏదో పాత ఇంటర్ స్టెల్లార్ సినిమా కోసం ఇప్పటి పుష్ప 2నో లేదా మరో ఇండియన్ సినిమానో కించపరచడం ఎంత మాత్రం సరికాదు. జాన్వీ ఖండించింది ఇదే.
This post was last modified on December 6, 2024 7:14 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…