జూనియర్ ఎన్టీఆర్‌ను బాగా నిరాశపరిచిన చిత్రాల్లో ‘రభస’ ఒకటి. అసలే వరుస ఫ్లాపుల్లో ఉంటే.. ఈ సినిమా కూడా ఫెయిలవడంతో అతను బాగా డిజప్పాయింట్ అయ్యాడు. ‘కందిరీగ’ లాంటి సూపర్ హిట్ తీసిన సంతోష్ శ్రీనివాస్ ఎన్టీఆర్‌కు మంచి విజయాన్నిస్తాడనుకుంటే.. రొటీన్ మాస్ ఎంటర్టైనర్ తీసి తారక్ అభిమానుల ఆశలను కూల్చేశాడు. ఐతే ఈ సినిమా మేకింగ్ మధ్యలో ఉండగానే దీన్ని ఆపేయాలని తాను సూచించినట్లు నిర్మాత బెల్లంకొండ సురేష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించడం విశేషం.
తనకు ఆ సినిమా ఏమాత్రం నచ్చలేదని ఆయన తెలిపారు. షూటింగ్ మధ్యలో ఉండగా తాను రష్ చూసి ఈ సినిమా ఆడదని.. కచ్చితంగా ఫ్లాప్ అవుతుందని నమ్మానని సురేష్ తెలిపారు. సినిమాను అక్కడితో ఆపేద్దామని కూడా టీంకు చెప్పినట్లు ఆయన వెల్లడించారు. ఐతే ఎన్టీఆర్ మాత్రం ఈ సినిమా వర్కవుట్ అవుతుందని.. మీకు అర్థం కావట్లేదు అని తనకు సర్దిచెప్పి సినిమా పూర్తి చేయించినట్లు తెలిపాడు. ఐతే సినిమా రిలీజయ్యాక తన అభిప్రాయమే కరెక్ట్ అని తేలిందని.. సినిమా ప్రేక్షకులకు నచ్చలేదని సురేష్ తెలిపాడు.
కానీ తాను అన్నట్లుగా సినిమా ఫ్లాప్ మాత్రం కాలేదని సురేష్ అన్నాడు. ఎన్టీఆర్ హీరో కావడం.. కందిరీగ డైరెక్టర్ తీసిన సినిమా కావడంతో ప్రేక్షకులు బాగానే థియేటర్లకు వచ్చారని.. మంచి ఓపెనింగ్స్ ఇచ్చారని.. ఫుల్ రన్లో ‘రభస’ 85 నుంచి 90 శాతం రికవరీ సాధించి బాక్సాఫీస్ లెక్కల్లో ఎబోవ్ యావరేజ్ మూవీగా నిలిచిందని సురేష్ వెల్లడించారు.
ఇది ఎన్టీఆర్ స్టార్ పవర్ వల్లే సాధ్యమైందన్నాడు. తాను అన్నట్లు సినిమా ప్రేక్షకులకు నచ్చలేదని.. అదే సమయంలో తారక్ నమ్మకం పెట్టుకున్నట్లు బాగానే ఆడిందని ఆయనన్నారు. 2014లో విడుదలైన ‘రభస’లో తారక్ సరసన సమంత, ప్రణీత సుభాష్ కథానాయికలుగా నటించారు.
This post was last modified on December 6, 2024 5:06 pm
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన..…
తల్లిదండ్రులపై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వరకు ఉండాల్సిందే. కానీ, జ్యాతస్యహి ధ్రువో మృత్యు.. అన్నట్టుగా కాలం…