తెలంగాణలో బెనిఫిట్ షోలు రద్దు చేస్తున్నామనే ప్రకటన రావడంతో ఒక్కసారిగా నైజామ్ బయ్యర్లకు షాక్ కొట్టినట్టయ్యింది. ఎందుకంటే కేవలం నెల రోజుల వ్యవధిలో సంక్రాంతి హడావిడి మొదలవుతుంది. అప్పుడు రిలీజయ్యే సినిమాల మీద పెద్ద ఎత్తున పెట్టుబడులు సిద్ధం చేసుకున్నారు. ముఖ్యంగా దిల్ రాజు నిర్మించిన గేమ్ ఛేంజర్ మీద మాములు అంచనాలు లేవు. ఆయన బ్యానర్ దే సంక్రాంతికి వస్తున్నాం రేసులో ఉంది. డాకు మహారాజ్ కు ఆయనే పంపిణీదారుడు. మొత్తం మూడు బరువైన బాధ్యతలు నెత్తి మీద ఉన్నాయి. వీటి వ్యాపార వ్యవహారాలతో పాటు ప్రమోషన్లు చూసుకోవాల్సి ఉంటుంది.
ఇప్పుడీ బెనిఫిట్ షోల బాంబు ఊహించనిది. పైగా టికెట్ రేట్ల పెంపు విషయంలో కూడా ఇకపై పునరాలోంచించే సంకేతాలు మంత్రి గారు ఇవ్వడంతో రాబోయే రోజుల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. కేవలం బెనిఫిట్ షోలు రద్దు చేసినంత మాత్రాన తీవ్ర నష్టాలు రావు కానీ మంచి రెవిన్యూ పోతుంది. ఎందుకంటే మిడ్ నైట్ షోలు కేవలం అభిమానులు మాత్రమే చూడటం లేదు. సగటు మూవీ లవర్స్ వీటికి అలవాటు పడిపోయి రాత్రి షో కాబట్టి పగలు సేవ్ అవుతుందనే ఉద్దేశంతో రేట్లు ఎక్కువైనా టికెట్లు కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. అందుకే ఎన్ని షోలు వేసినా ప్రతి ఊరిలో హౌస్ ఫుల్స్ పడుతున్నాయి.
ఇప్పుడీ పరిణామం వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది గేమ్ ఛేంజర్. ఎందుకంటే బడ్జెట్ పరంగా అన్నింటికన్నా చాలా పైన ఉంది ఈ సినిమానే. బాలయ్య, వెంకీ సినిమాలకు ఇందులో సగం కూడా ఖర్చు కాలేదు. సో ప్రీమియర్లు వేయకపోయినా పెద్ద డ్యామేజ్ ఉండదు. మరి దిల్ రాజు ఎలాంటి స్ట్రాటజీని ఫాలో అవుతారో చూడాలి. ఒకవేళ ముందు రోజు సాయంత్రం లేదా రాత్రి షోలు వేసుకుంటే ఇబ్బంది ఉండదు. కాకపోతే బెనిఫిట్ పేరు పెట్టకుండా రెగ్యులర్ షోస్ అని చూపించుకోవాలి. కానీ ప్రాక్టికల్ గా చాలా సమస్యలు వస్తాయి. ఇది పరిష్కారం కాకపోతే ముందొచ్చే ప్యాన్ ఇండియా సినిమాలకూ ఇబ్బంది తప్పదు.
This post was last modified on December 6, 2024 3:28 pm
తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం భక్తులు భారీగా తరలివచ్చి జరిగిన తొక్కిసలాటతో చోటుచేసుకున్న విషాదం యావత్ దేశాన్ని…
తలా అని అభిమానులు ప్రేమగా పిలుచుకునే అజిత్ ఏడాదికి ఒక సినిమా చేయడమే మహా గగనం. అలాంటిది కేవలం మూడు…
జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్ సమస్యలు భారత క్రికెట్లో కీలక చర్చకు కారణమవుతున్నాయి. ఇటీవల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా వెన్నునొప్పితో ఇబ్బందులు…
తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన…
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకోవాలన్న కోటి ఆశలతో వచ్చి ప్రాణాలు కోల్పోయిన వారిని తలచుకుంటేనే కన్నీళ్లు…
కొత్త సినిమాల రిలీజ్ సందర్భంగా ప్రదర్శిస్తున్న ప్రీమియర్ షోలను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టిన సందర్భంగా…