Movie News

తెలంగాణలో బెనిఫిట్ షోలు బంద్ – పుష్ప 2 ఎఫెక్ట్

ఇకపై తెలంగాణ రాష్ట్రంలో బెనిఫిట్ షోలను నిషేధిస్తున్నామని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించడం సంచలనం రేపుతోంది. ఇటీవలే పుష్ప 2 ది రూల్ విడుదల సందర్భంగా హైదరాబాద్ సంధ్య 70 ఎంఎం థియేటర్ దగ్గర ఏర్పడిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందగా ఆమె కుమారుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఫ్యాన్స్ ఉత్సాహాన్ని ప్రత్యక్షంగా చూసే ఉద్దేశంతో బన్నీ అక్కడికి రావడంతో ఒక్కసారిగా తోపులాట పెరిగిపోయి ఈ విషాదం చోటు చేసుకుంది. అల్లు అర్జున్ తో పాటు దీనికి బాధ్యులైన వారి మీద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఇప్పుడు నైజామ్ లో బెనిఫిట్ షోలు రద్దు చేయడమంటే ఇకపై ప్యాన్ ఇండియా నిర్మాతలకు పడబోయే దెబ్బ చిన్నగా ఉండదు. ఎందుకంటే జనవరి పండక్కు గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం లాంటి క్రేజీ రిలీజులు ఉన్నాయి. ప్రీమియర్లకు, స్పెషల్ షోలకు పెద్ద ఎత్తున హైక్ ఇవ్వడంతో పుష్ప 2 అంత కాకపోయినా తమకు అదనంగా ప్రయోజనం ఉంటుందనే కోణంలో నిర్మాతలు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు కేవలం రెగ్యులర్ షోలంటే భారీగా వచ్చే రెవిన్యూకి గండి పడుతుంది. ఒకవేళ మొన్న ట్రాజెడీ జరగకపోయి ఉంటే ఇప్పుడీ బ్యాన్ ఉండేది కాదన్నది వాస్తవం.

మరి ఏపీలో ముందస్తు షోలు కొనసాగిస్తారా లేదా అనేది ప్రొడ్యూసర్ల నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఇండస్ట్రీలో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఫ్యాన్స్ క్రేజ్ కి అడ్డాగా మారిన ఆర్టిసి క్రాస్ రోడ్స్ వల్లే ఇప్పుడీ పరిస్థితి వచ్చింది. అభిమానులు అత్యుత్సాహంతో అక్కడ సినిమా చూస్తేనే ఏదో సాధించినట్టు ఫీలవ్వడం కూడా దీనికి దోహదం చేస్తోంది. కొన్నేళ్ల క్రితం ఇదే తరహాలో బెనిఫిట్ షోలకు తెలంగాణ సర్కారు అనుమతి ఇవ్వలేదు. తర్వాత మళ్ళీ మాములు అయ్యింది. మరిప్పుడు సుదీర్ఘ కాలం ఈ బ్యాన్ ఉంటుందా లేక కొంత కాలం అయ్యాక మినహాయింపులు ఇస్తారా చూడాలి.

This post was last modified on December 6, 2024 12:45 pm

Share

Recent Posts

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

5 minutes ago

టీడీపీకి 58 కోట్లు.. వైసీపీకి 24 కోట్లు.. బీఆర్ ఎస్‌కు 16 కోట్లు..

భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన విరాళాల నివేదికల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజకీయ పార్టీలు తమకు అందిన…

1 hour ago

కార్తీ రేంజు ఇంత పడిపోయిందా

యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఖైదీ, ఊపిరి లాంటి సూపర్ హిట్స్ తో కార్తీకి తెలుగులోనూ సాలిడ్ మార్కెట్…

3 hours ago

జడల్ జమానాకు ఇంకో కీలక ఛాన్స్

నైజాంలో డీసెంట్ గా నెట్టుకొస్తున్న ప్యారడైజ్ రెండో వారంలోకి అడుగు పెట్టడానికి ముందే ఆంధ్ర, సీడెడ్ సైడ్ బాగా నెమ్మదించిపోవడం…

3 hours ago

ఖైరతాబాద్ నుంచి జనసేన పోటీ

ఏ నిముషంలో దానం నాగేందర్ పార్టీ మారి ఎమ్మెల్యే పదవి కోల్పోయాడో కానీ తెలంగాణా రాజకీయాలు మరింత సందడిగా మారిపోయాయి.…

4 hours ago

రాజమౌళి చెప్పిన ఈ ఫార్ములా ఫాలో అయితే?

రాజమౌళి తన సినిమాల మేకింగ్ కోసం ఎక్కువ టైం తీసుకుంటాడన్న మాటే కానీ.. ఔట్ పుట్ మాత్రం వేరే లెవెల్లో…

4 hours ago