ఈ రోజు భారీ అంచనాల మధ్య విడుదలైన ‘పుష్ప: ది రూల్’ చాలా వరకు పాజిటివ్ టాకే తెచ్చుకుంటోంది. కొంత డివైడ్ టాక్ కూడా ఉన్న మాట వాస్తవం. ‘పుష్ప: ది రైజ్’తో పోలిస్తే ఇందులో పెద్దగా కథ లేదని.. క్యారెక్టర్ జర్నీ కనిపించలేదని.. కథ ఫ్లాట్‌గా నడిచిపోయిందని.. వినిపిస్తున్నాయి. ఐతే సినిమా గురించి ఎవరేమన్నా.. ఇందులో అందరూ సూపర్ అనే విషయం మాత్రం ఒకటి ఉంది. అదే.. బన్నీ పెర్ఫామెన్స్.
ప్రతి నటుడూ కెరీర్లో ఇలాంటి ఒక పాత్ర చేయాలి.. ఇలాంటి ఒక పెర్ఫామెన్స్ ఇవ్వాలి అనిపించేలా.. పుష్ప పాత్రలో చెలరేగిపోయాడు బన్నీ. ఫస్ట్ పార్ట్‌లోనే తనదైన పెర్ఫామెన్స్‌తో పుష్ప పాత్ర జనాల గుండెల్లోకి దూసుకెళ్లేలా చేయగలిగాడు బన్నీ. రెండో పార్ట్‌లో తన నటన ఇంకో స్థాయికి చేరుకుంది. పుష్ప పాత్రకు ఉండే యాటిట్యూడ్‌ను అతను తన హావభావాలతో చూపించిన తీరు సినిమాలో మేజర్ హైలైట్‌గా చెప్పొచ్చు. బన్నీ నట కౌశలానికి తార్కాణంగా నిలిచే చాలా సీన్లు సినిమాలో ఉన్నాయి.ఐతే మిగతా అన్నీ ఒకెత్తయితే.. జాతర ఎపిసోడ్లో బన్నీ పెర్ఫామెన్స్ మరో ఎత్తు.
స్టార్ హీరోల్లో ఎవ్వరూ చేయలేని సాహసాన్ని ఈ పాత్రతో చేశాడు బన్నీ. ఆడవేషం కట్టి చూడ్డానికి భయానకంగా కనిపించే అవతారంలోకి మారడం అందరు హీరోలూ చేయలేరు. మేకప్ కోసం బన్నీ ఎన్ని రోజుల పాటు ఎంత కష్టపడి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. కేవలం మేకప్‌తో అయిపోయే కష్టం కాదిది. ఆ పాత్రలో బన్నీ చేసిన తాండవం చూసి ఫిదా అవ్వని వాళ్లుండరు. గంగమ్మ పూనినపుడు అతను చేసిన నృత్యం.. తను ఇచ్చిన హావభావాల గురించి ఎంత చెప్పినా తక్కువే.
మొత్తంగా 20 నిమిషాల పాటు సాగే ఆ ఎపిసోడ్లో బన్నీ నట విశ్వరూపాన్ని చూడొచ్చు. తనకు కూతురే కావాలని కోరుకోవడానికి కారణం చెప్పే సీన్లో బన్నీ నటన కన్నీళ్లు పెట్టించేస్తుంది. మొత్తంగా ఈ ఒక్క ఎపిసోడ్‌తో తన అభిమానులనే కాక సామాన్య ప్రేక్షకులను కూడా కదిలించేసి తాను ఎంత మంచి పెర్ఫామర్‌నో రుజువు చేసుకున్నాడు బన్నీ. ఈ పెర్ఫామెన్సుకు అతడికి ఎన్ని వీరతాళ్లు వేసినా తక్కువే.
This post was last modified on December 6, 2024 11:47 am
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…
భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన విరాళాల నివేదికల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజకీయ పార్టీలు తమకు అందిన…
యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఖైదీ, ఊపిరి లాంటి సూపర్ హిట్స్ తో కార్తీకి తెలుగులోనూ సాలిడ్ మార్కెట్…
నైజాంలో డీసెంట్ గా నెట్టుకొస్తున్న ప్యారడైజ్ రెండో వారంలోకి అడుగు పెట్టడానికి ముందే ఆంధ్ర, సీడెడ్ సైడ్ బాగా నెమ్మదించిపోవడం…
ఏ నిముషంలో దానం నాగేందర్ పార్టీ మారి ఎమ్మెల్యే పదవి కోల్పోయాడో కానీ తెలంగాణా రాజకీయాలు మరింత సందడిగా మారిపోయాయి.…