నందమూరి వారసుడి కోసం ఎదురు చూపులు తీరాయని అభిమానులు సంతోష పడుతున్న టైంలో హఠాత్తుగా పిడుగు లాంటి వార్త వాళ్ళ నెత్తి మీద పడింది. ముందు అనుకున్న ప్లానింగ్ ప్రకారమైతే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందే మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ఇవాళ పూజా కార్యక్రమాలతో ప్రారంభం కావాల్సింది. కానీ వాయిదా వేస్తున్నట్టు మీడియాకు నోట్ పంపించారు తప్పించి కారణాలు పేర్కొనలేదు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం మోక్షజ్ఞ మరికొంత టైం అడుగుతున్నాడని సమాచారం. కొంచెం ఆలస్యంగానా లేక అసలు వద్దనుకుంటున్నాడా అనేది బయటికి తెలియడం లేదు. ఇప్పుడప్పుడే కాదని అన్నట్టు వినికిడి.
ఆల్రెడీ మోక్షజ్ఞ కోసం మంచి లైనప్ సిద్ధంగా ఉంచారు బాలయ్య. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ ఒక ప్రాజెక్టు అనుకుందట. తర్వాత ఆదిత్య 999 మ్యాక్స్ ని కొడుకు హీరోగా తన డైరెక్షన్ లో చేయాలని బాలయ్య ఆలోచన. మరికొందరు దర్శక నిర్మాతలు మోక్షజ్ఞ కథలు వింటానంటే వినిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. తెరంగేట్రంకు అంతా సిద్ధం ఉండి, ఫోటో షూట్ కూడా అయిపోయిన తరుణంలో హఠాత్తుగా నిర్ణయం మార్చుకోవడం వెనుక లోగుట్టు ఎవరికీ అంతు చిక్కడం లేదు. ప్రశాంత్ వర్మది దాదాపు క్యాన్సిలని ఫిలిం నగర్ టాక్. అతనుగా చెబుతాడేమో చూడాలి.
సింబా ఈజ్ కమింగ్ అంటూ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న టైంలో ఇలాంటి న్యూస్ వినాల్సి రావడం ఊహించని పరిణామం. ఇప్పటికే బాగా లేట్ అయిపోయిన మోక్షజ్ఞ ప్రవేశం వీలైనంత త్వరగా చేస్తే బెటర్. మేకోవర్ చేసుకుని, నటనతో పాటు కీలకమైన శాఖలకు సంబంధించిన శిక్షణ తీసుకుని, ఫోటోల్లో భేష్ అనిపించుకుని అన్ని జరిగాక ఇప్పుడు వద్దని చెప్పడం వెనుక గుట్టు ఏమై ఉంటుందోనని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. బాలయ్య త్వరలో డాకు మహారాజ్ ప్రమోషన్లలో పాల్గొనబోతున్నారు కాబట్టి ఆ టైంకి ఇచ్చే ఇంటర్వ్యూలలో మోక్షజ్ఞ గురించి ఏం చెబుతారో చూడాలి. అప్పటిదాకా జస్ట్ వెయిట్.
This post was last modified on December 5, 2024 7:28 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…