Movie News

జాలి రెడ్డిని వాడుకోలేదేంటి పుష్పా?

ఇవాళ విడుదలైన పుష్ప 2 ది రూల్ ప్రభంజనం థియేటర్ల దగ్గర మొదలైపోయింది. మాస్ ప్రేక్షకులు ఏదైతే కోరుకున్నారో దానికి రెట్టింపు డోస్ దర్శకుడు సుకుమార్ వడ్డించడంతో జనాల రద్దీ మాములుగా లేదు. అల్లు అర్జున్ విశ్వరూప దర్శనం జరగడంతో ఫ్యాన్స్ సంతోషానికి పట్టపగ్గాల్లేకుండా పోయాయి.

ముఖ్యంగా జాతర ఎపిసోడ్ గురించి పదే పదే మాట్లాడుకోవడం చూసి రెండోసారి జాతీయ అవార్డు ఖాయమని బల్లగుద్ది చెబుతున్నారు. ఇలా వరసగా రెండుసార్లు ఇస్తారా లేదానేది పక్కనపెడితే బన్నీ నిజంగా దానికి అర్హుడన్నది వాస్తవం. పుష్ప 1 ది రైజ్ లో కనిపించిన పాత్రలన్నీ ఇందులో ఉన్నాయి.

కానీ ఒక్క జాలి రెడ్డి మిస్ కావడం మాత్రం ప్రేక్షకులు లోటుగా ఫీలవుతున్నారు. ఎందుకంటే మొదటి భాగంలో ఈ పాత్ర పోషించిన శాండల్ వుడ్ నటుడు డాలీ ధనుంజయ్ కీలక ఎపిసోడ్లు పండటంలో తన వంతు పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. శ్రీవల్లిని కవ్వించి పుష్ప చేతిలో కాళ్ళు విరగొట్టుకునే సన్నివేశం ఓ రేంజ్ లో పేలింది. కానీ పుష్ప 2లో జాలి రెడ్డి జాడే లేదు.
మంగళం శీను, ద్రాక్షాయని, ఎంపీ సిద్ధప్ప, జక్కారెడ్డి, ఎస్పి భన్వర్ సింగ్ షెకావత్ ఇలా అందరూ ఉన్నారు కానీ ఇతను మాత్రం కనిపించలేదు. చివర్లో కొన్ని సెకండ్లు చూపించారు కానీ అక్కడా ఎలాంటి డైలాగు లేకుండా చిన్న ట్విస్టు ఇచ్చి ముగించారు.

కథ డిమాండ్ చేయలేదా లేక కన్నడ ఫ్యాన్స్ ఇలా విలన్ వేషాలు వేయొద్దని చెప్పడం వల్లే తనే నో చెప్పాడా తెలియదు కానీ పుష్ప 2లో జాలీ రెడ్డి అంతసేపు ఎందుకు కనిపించలేదనే కారణం సుకుమార్ కన్విన్సింగ్ గా చెప్పలేకపోయారు. పుష్ప 3 ది ర్యాంపేజ్ ఉంటుందో లేదో తెలియదు కానీ ప్రస్తుతానికి కార్డు మాత్రం వేశారు. అల్లు అర్జున్, సుక్కు పలు సందర్భాల్లో అన్న మాటలను బట్టి చూస్తే మూడో భాగం ఇప్పట్లో జరిగే పనైతే కాదు.

ఒకవేళ రెండు మూడు సంవత్సరాల తర్వాత భవిష్యత్తులో తీస్తే అప్పుడు జాలీ రెడ్డిని తీసుకొచ్చి ఏమైనా నిడివి పెంచి ప్రాధాన్యత ఇస్తారేమో చూడాలి. కొసమెరుపు ఏంటంటే గత ఏడాది ఆగస్ట్ 23 ధనుంజయ్ పుట్టినరోజు సందర్భంగా జాలీ రెడ్డి లెక్కలు సరిచేస్తాడని పుష్ప హ్యాండిల్ నుంచి ట్వీట్ పెట్టారు. కానీ ఇప్పుడు హ్యాండ్ ఇచ్చారు.

This post was last modified on December 5, 2024 5:55 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

11 minutes ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

47 minutes ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

1 hour ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

4 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

6 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

9 hours ago