ప్రాణం తీసిన అభిమానం.. బన్నీని చూసేందుకు తొక్కిసలాట.. మహిళ మృతిఅభిమానం ప్రాణం తీసింది. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ‘పుష్ప2’ మూవీ ప్రీమియర్ షో చూసేందుకు జనాలు ఎగబడటం ఒక ఎత్తు అయితే.. చిత్ర కథానాయకుడు అల్లు అర్జున్ ను చూసేందుకు జనం పోటెత్తారు. ఈ క్రమంలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఒక మహిళ మరణానికి కారణమైతే.. ఒక బాలుడి పరిస్థితి సీరియస్ గా ఉంది. హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట తీవ్ర విషాదానికి కారణమైంది.
భారీ అంచనాల మధ్య విడుదలైన పుష్ప2 ప్రీమియర్ షోలను బుధవారం రాత్రి నుంచి మొదలు కావటం తెలిసిందే. ఈ నేషథ్యంలో తన ఫ్యాన్స్ కు బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చేందుకు బన్నీ అలియాస్ అల్లు అర్జున్ బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు. హైదరాబాద్ మహానగరంలో ఎన్ని థియేటర్లు ఉన్నా.. క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న కొన్ని థియేటర్లు ఎంత స్పెషల్ అన్న విషయం తెలిసిందే. ఇందుకు తగ్గట్లే.. సంధ్య 70ఎంఎం థియేటర్ లో ఫ్యాన్స్ తో కలిసి సినిమా చూసేందుకు చిత్ర కథానాయకుడు అల్లు అర్జున్ స్వయంగా విచ్చేశారు.
ఈ సినిమా ప్రీమియర్ షోను వీక్షించేందుకు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున టికెట్లు బుక్ చేసుకున్నారు. భారీగా వచ్చిన అభిమానులు.. మరోవైపు అల్లు అర్జున్ ను చూడాలన్న ఆత్రుత వెరసి.. తీవ్ర తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఒక మహిళ ప్రాణాల్ని తీసింది. మరో బాలుడి పరిస్థితి విషమంగా మారింది.
తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన 39 ఏళ్ల రేవతిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాల్ని విడిచింది. మరోవైపు తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె కుమారుడు తొమ్మిదేళ్ల శ్రీతేజ్ కు పోలీసులు సీపీఆర్ చేసి.. బేగంపేట కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వెంటిలెటర్ మీద చికిత్స అందిసతున్నారు. అభిమానుల్ని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు.
కుటుంబం మొత్తంతో కలిసి సినిమాచూసేందుకు వచ్చిన రేవతి.. ఆమె కుమారుడు ఇద్దరు తొక్కిసలాటతో తీవ్రంగా గాయపడ్డారు. కాసేపట్లో సినిమా చూసేందుకు కాస్త ముందు చోటు చేసుకున్న ఈ పరిణామం తీవ్ర విషాదాన్ని నింపింది. అనుకోని పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితి చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. ఈ మూవీ మీద నెలకొన్న క్రేజ్ నేపథ్యంలో పోలీసులు మరింత భారీగా మొహరించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదంటున్నారు.
ఈ విషాద ఉదంతం నేపథ్యంలో థియేటరర్ వద్ద దాదాపు 200 మందికి పైగా పోలీసుల్ని మొహరించారు. అల్లు అర్జున్ మీద అభిమానంతో ప్రీమియర్ షోకు రేవతి కుటుంబం సినిమా చూసేందుకు దిల్ షుక్ నగర్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కు వచ్చినట్లుగా తెలుస్తోంది.
This post was last modified on December 5, 2024 9:46 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…