ఒక కథను రెండు భాగాలుగా తీస్తే.. ఫస్ట్ పార్ట్ రిలీజైన దగ్గర్నుంచి ప్రేక్షకులు గెస్సింగ్‌లో పడిపోతారు. తొలి భాగంలో అసంపూర్తిగా వదిలేసిన కథను ఎలా ముగిస్తారు.. పాత్రల పరంగా తలెత్తిన ప్రశ్నలకు ఎలాంటి సమాధానం ఇస్తారు అని ఎదురు చూస్తారు. ‘బాహుబలి: ది కంక్లూజన్’ రిలీజ్‌కు ముందు ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు’ అనే ప్రశ్న జనాలను ఎంతగా ఉక్కిరిబిక్కిరి చేసిందో తెలిసిందే. సెకండ్ పార్ట్‌కు ఏ పబ్లిసిటీ లేకుండానే కావాల్సినంత హైప్ తెచ్చిపెట్టింది ఈ ప్రశ్న.
‘పుష్ప: ది రూల్’ విషయంలో ఇలాంటి పెద్ద ప్రశ్న ఏదీ లేదు కానీ.. ప్రేక్షకులు సమాధానం తెలుసుకోవాలని ఆశిస్తున్న ప్రశ్నలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా పుష్ప, షెకావత్ మధ్య పోరు ఎలా ఉంటుందనే ఆసక్తి సర్వత్రా ఉంది. వీళ్లిద్దరి మధ్య ఎత్తులు పై ఎత్తులు ఎలా ఉంటాయన్నదే అత్యంత ఆసక్తి రేకెత్తించే అంశం. మాస్ ప్రేక్షకులు ప్రధానంగా ఎదురు చూస్తున్నది వీళ్లిద్దరి పోరు కోసమే. ఐతే మాస్ ఆడియన్స్ కోరుకునే అంశాలకు లోటు లేని ‘పుష్ప-2’లో ఎమోషనల్ బ్లాక్స్ కూడా గట్టిగానే పడ్డట్లు సమాచారం.
పుష్ప-శ్రీవల్లి మధ్య బలమైన ఎమోషన్ ఉంటుందని.. పుష్ప పాత్రను డ్రైవ్ చేసేది శ్రీవల్లి క్యారెక్టరే అని తెలుస్తోంది. ఇది కాక సినిమాలో ఒక పేలిపోయే ఎమోషనల్ బ్లాక్ ఉంటుందని.. అది ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుందని సమాచారం. ‘పుష్ప’ కథలో అత్యంత కీలకమైన అంశం.. అతడికి ఇంటి పేరు లేకపోవడం. ఈ విషయంలో అవమానాలకు గురవడం వల్లే పుష్పలో కసి పెరిగి అంచెలంచెలుగా ఎదుగుతాడు. కానీ ఎంత ఎదిగినా అతడిని ఇంటి పేరు లేని బాధ వెంటాడుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో పుష్ప-2లో అదిరిపోయే పేఆఫ్ సీన్ ఉంటుందట.
ప్రి క్లైమాక్స్‌లో వచ్చే ఆ ఎపిసోడ్ ప్రేక్షకులను ఎమోషనల్‌గా కదిలించేస్తుందని సమాచారం. పుష్పను మొదట్నుంచి అవమానిస్తూ వచ్చిన తన అన్నే అతడికి ఇంటిపేరును ఇచ్చే ఎపిసోడ్ ఇదని.. ఇందులో ఎమోషన్‌తో పాటు ఎలివేషన్ కూడా ఉంటుందని.. ఈ ఎపిసోడ్లో బన్నీ, అజయ్‌ల పెర్ఫామెన్స్ ఒక రేంజిలో ఉంటుందని సమాచారం. సినిమాకు హైలైట్‌గా నిలిచే ఈ ఎపిసోడ్ థియేటర్లలో ప్రేక్షకులకు మాంచి హై ఇస్తుందట.
This post was last modified on December 4, 2024 4:48 pm
నిజమే. కేవలం రూ.500 లను పెట్టుబడిగా పెట్టిన ఆ ట్రక్కు డ్రైవర్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయాడు. ఇదేదో ఎక్కడో…
పెట్టుబడులను రాబట్టేందుకు ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్లిన తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి రెండో రోజే ఫలితం రాబట్టారు.…
ఏపీలో అధికార కూటమిలో కీలక పార్టీగా ఉన్న జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలోని రాజకీయా…
2023 సంక్రాంతికి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన వీరసింహారెడ్డి దర్శకుడు గోపీచంద్ మలినేని మరోసారి బాలకృష్ణతో చేతులు కలపబోతున్నారు. త్వరలో…
గత ఏడాది రాజకీయాల కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రేక్ తీసుకున్న టైంలో ఆయన చేతిలో మూడు చిత్రాలున్నాయి.…
టెక్నాలజీ రంగంలో తెలుగు ప్రజలు ఇప్పుడు విశ్వవ్యాప్తంగా సత్తా చాటుతున్నారు. ఐటీలో మేటి సంస్థలు మైక్రోసాఫ్ట్, గూగుల్ లకు భారతీయులు……