Movie News

హాట్ డిస్కషన్: పుష్ప-2 ఓపెనింగ్ ఎంత?

పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో ఏదైనా పెద్ద సినిమా వస్తోందంటే.. దాని ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి.. రికార్డులేమైనా బద్దలవుతాయా అనే చర్చ జరుగుతుంది. ‘పుష్ప: ది రూల్’కు ఏ స్థాయిలో హైప్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘బాహుబలి-2’, ‘కేజీఎఫ్-2’ తర్వాత అంతగా అంచనాలు పెంచిన సీక్వెల్ ఇది. దీంతో ఈ సినిమా రిలీజ్ ముంగిట వసూళ్ల గురించి చర్చ మొదలైంది. వెయ్యి కోట్లకు పైగా బిజినెస్ చేసిన ఈ చిత్రం.. వసూళ్లలో కూడా ఆ మార్కును ఈజీగా అందుకుంటుందనే అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమాకు ఉన్న పెద్ద ప్లస్.. నార్త్ ఇండియాలో తిరుగులేని హైప్ తెచ్చుకోవడం. ‘బాహుబలి-2’ తర్వాత అంత హైప్ ఈ చిత్రానికే ఉంది.నార్త్ ఇండియన్ రూరల్ బెల్ట్స్‌లో ‘పుష్ప-2’ కోసం జనం ఊగిపోతున్నారు. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌ను పాట్నాలో నిర్వహించగా వచ్చిన రెస్పాన్సే దీనికి నిదర్శనం. దీంతో హిందీ వెర్షన్ ఓపెనింగ్స్ మామూలుగా ఉండవని అర్థమవుతోంది.తెలుగు రాష్ట్రాల్లో ‘పుష్ప-2’ రికార్డ్ బ్రేకింగ్ టికెట్ రేట్లతో రిలీజవుతోంది. ఉత్తరాదినే కాక.. దక్షిణాదిన తమిళనాడు, కర్ణాటక, కేరళల్లో కూడా ఈ సినిమాకు మంచి హైప్ ఉంది.

అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరుగుతున్నాయి. కాబట్టి ఓపెనింగ్స్ ఒక రేంజిలో ఉంటాయనడంలో సందేహం లేదు. ‘పుష్ప-2’ ఓపెనింగ్స్ కౌంట్ రూ.200 కోట్లకు తగ్గేలా లేదు. వైడ్ రిలీజ్, రౌండ్ ద క్లాక్ షోలు, భారీ టికెట్ల రేట్లు.. ఈ మూడు విషయాలనూ పరిగణనలోకి తీసుకుని చూస్తే ‘పుష్ప-2’ రూ.250 కోట్ల మేర తొలి రోజు వసూళ్లు రాబడుతుందని అంచనా. నిజంగా ఆ స్థాయిలో సినిమా కలెక్షన్ రాబడితే ఇండియన్ సినిమా లో ఒక సరికొత్త రికార్డు నమోదైనట్లే.

ఫుట్ ఫాాల్స్ విషయంలో ‘బాహుబలి-2’ను ఏ సినిమా కొట్టే పరిస్థితి లేదు కానీ.. పెరిగిన టికెట్ల ధరలు, వైడ్ రిలీజ్ వల్ల ఆ సినిమా వసూళ్లను ఇప్పటి సినిమాలు దాటేస్తున్నాయి. ‘పుష్ప-2’కు రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్ రావడం మాత్రం లాంఛనమే. టాక్‌ను బట్టి సినిమాకు లాంగ్ రన్ ఉంటుంది. ఓవరాల్ వసూళ్లను దాటడం కూడా దాని మీదే ఆధారపడి ఉంది.

This post was last modified on December 4, 2024 4:12 pm

Share

Recent Posts

చిన్న సినిమా సృష్టిస్తున్న సంచలనం పెద్దదే

కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…

1 hour ago

మల్టీస్టారర్ మూవీకి మర్చిపోలేని అవమానం

కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…

2 hours ago

ఆంధ్రా ముద్దుబిడ్డ అనంత్ అంబానీ

నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…

3 hours ago

చాక్లెట్లు తీసుకొని టిక్కెట్లు ఇచ్చిన సీఎం

తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…

3 hours ago

వివేకా కేసులో అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు

వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…

4 hours ago

త్రివిక్రమ్ వదులుకున్నది త్రివిక్రమ్‌కే పోటీగా

గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…

4 hours ago