వచ్చే వారం పుష్ప-2 రిలీజవుతుంటే.. ఏ ధైర్యంతో ఇప్పుడు మీ సినిమాను రిలీజ్ చేస్తున్నారు అంటూ గత వారం ‘మిస్ యు’ ప్రమోషనల్ ప్రెస్ మీట్లో హీరో సిద్దార్థ్‌ను విలేకరులు ప్రశ్నిస్తే.. మాకెందుకు భయం, భయపడితే వాళ్లే భయపడాలి అంటూ ఘనంగా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంత ధీమాగా మాట్లాడుతున్నాడంటే సినిమాలో ఎంత మంచి కంటెంట్ ఉందో.. సిద్దార్థ్ కాన్ఫిడెన్సే వేరు అనుకున్నారు. కానీ ఒక రోజు గడిచేసరికి కథ మారిపోయింది. ‘మిస్ యు’ సినిమాను వాయిదా వేసేసింది చిత్ర బృందం.
దానికి కారణం తమిళనాట కురుస్తున్న భారీ వర్షాలని చెప్పింది. కానీ ‘పుష్ప-2’కు భయపడే ఈ చిత్రాన్ని వాయిదా వేశారని.. బన్నీ సినిమా ప్రభంజనం మొదలయ్యాక ఈ చిత్రాన్ని ఎవరూ పట్టించుకోరనే ఈ నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఏదేమైనా వాయిదా నిర్ణయం సినిమా మంచికే అన్నది మాత్రం వాస్తవం.ఇప్పుడు ‘మిస్ యు’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది. డిసెంబరు 13న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఆ రోజే రిలీజవుతుంది.
ఐతే ముందు వారం తమ చిత్రాన్ని రిలీజ్ చేస్తే.. ‘పుష్ప-2’కు ఉన్న ప్రి రిలీజ్ హైప్ వల్ల తొలి వీకెండ్‌కే తమ చిత్రాన్ని మరిచిపోయే ప్రమాదం ఉందని టీం భావించి ఉండొచ్చు. అలాగే పుష్ప-2 వస్తుంటే ‘మిస్ యు’ టాక్ ఎలా ఉన్నా సరే.. తెలుగు రాష్ట్రాల్లో ఉణ్న అన్ని థియేటర్ల నుంచి దాన్ని లేపేయడం ఖాయం. తమిళనాట కూడా థియేటర్ల సమస్య తప్పదు. అందుకే టీం వెనుకంజ వేసింది. ‘పుష్ప-2’ రిలీజైన ఎనిమిది రోజుల తర్వాత ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తుండడంతో అప్పటికి బన్నీ సినిమా ప్రభంజనం తగ్గి ఉంటుందని.. థియేటర్ల సమస్య కూడా ఉండదని భావించినట్లున్నారు.
కానీ ‘పుష్ప-2’కు టాక్ బాగుంటే రెండో వారంలో కూడా దాని ధాటిని తట్టుకోవడం కష్టమే అవుతుంది. కాబట్టి ఈ సినిమాకు మరీ పాజిటివ్ టాక్ వస్తె మాత్రం సిద్దు కి కొంచం అడ్డుకట్ట పడినట్టే అవుతుంది. మరి గత వారం తప్పించుకున్న ముప్పును.. తర్వాతి వారంలో కూడా ‘మిస్ యు’ తప్పించుకుంటుందేమో చూడాలి.
This post was last modified on December 4, 2024 4:16 pm
‘బాహుబలి: ది బిగినింగ్’కు పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేసినపుడు బాలీవుడ్ నుంచి మంచి సపోర్టే లభించింది. కరణ్ జోహార్…
తిరుమల తోపులాట ఘటనలో ఆరుగురు భక్తులు చనిపోయిన ఘటనపై ఏపీలోని కూటమి ప్రభుత్వం వేగంగా స్పందించింది. బుధవారం విశాఖ పర్యటనకు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఒక్క తెలుగు రాష్ట్రాలే కాదు… దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు విదేశాల…
అభిమానులు ఆతృతగా ఎదురు చూసిన అన్ స్టాపబుల్ 4 నుంచి బాలకృష్ణ - రామ్ చరణ్ ఎపిసోడ్ నిన్న సాయంత్రం…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం ఉదయం ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఫార్ములా…
నిజమే. ఓ వైపు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత బుధవారం రాత్రి ఘోర విషాదం చోటుచేసుకుంది. అనూహ్యంగా…