నేచురల్ స్టార్ నాని ఇప్పుడు మెగా అభిమానుల ఫేవరెట్‌గా మారిపోయాడు. మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమానిగా సందర్భం వచ్చినపుడల్లా ఆయన మీద చూపించే అభిమానంతో నాని ఎప్పట్నుంచో మెగా అభిమానుల మనసు దోస్తూ వస్తున్నాడు నాని. ఐతే ఇన్నాళ్లూ ఆ అభిమానం మాటల వరకే పరిమితం అయ్యేది. ఇప్పుడది చేతల్లోకి వచ్చింది. చిరు చేస్తున్న సినిమాలు, ఆయన ఎంచుకుంటున్న దర్శకుల విషయంలో అసంతృప్తితో ఉన్న మెగా ఫ్యాన్స్‌కు మాంచి కిక్కు ఇస్తూ.. ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో మెగాస్టార్‌కు సినిమా సెట్ చేశాడు.
శ్రీకాంత్ ఓదెలతో చిరు సినిమా అనే విషయం కొన్ని రోజుల ముందే మీడియాకు వెల్లడైంది. కానీ ఈ ప్రాజెక్టును నాని సెట్ చేస్తున్నాడనే విషయం ఎవరికీ తెలియదు. ఈ సినిమాకు కర్త, కర్మ, క్రియ మొత్తం తనే అని తెలిసి మెగా ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ అవుతున్నారు. శ్రీకాంత్‌ను నమ్మి ‘దసరా’ సినిమా చేసి కెరీర్లో అతి పెద్ద విజయాన్నందుకున్న నాని.. అతణ్ని తర్వాత కూడా ప్రోత్సహిస్తూ మరో సినిమాకు కమిటయ్యాడు. అంతటితో ఆగకుండా చిరుకు వీరాభిమాని అయిన శ్రీకాంత్‌ను తన అభిమాన కథానాయకుడితో సినిమా చేసేలా మరింత ఎంకరేజ్ చేసి.. ఆయన్ని చేరేందుకు సహకరించాడు.
ఓవైపు తనతో సినిమా చేస్తుండగా.. ఇంకో ప్రాజెక్టు గురించి దర్శకుడు ఆలోచిస్తుంటే ఏ హీరో అంగీకరించడు. మధ్యలో వేరే ప్రాజెక్టు అనౌన్స్‌మెంట్‌కు కూడా ఒప్పుకోడు. కానీ తన లాగే చిరుకు వీరాభిమాని అయిన శ్రీకాంత్ విషయంలో మాత్రం నాని అలా ఆలోచించలేదు. మధ్యలో చిరు, శ్రీకాంత్ మధ్య మీటింగ్ ఏర్పాటు చేసి కథ ఓకే అయ్యేలా చూడడమే కాదు.. ఈ సినిమాలో నిర్మాణ భాగస్వామిగానూ మారాడు. నానీనే స్వయంగా ఈ ప్రాజెక్టును ప్రకటించడంతో మెగా ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ అయ్యారు.
రీఎంట్రీ తర్వాత సరైన సినిమాలు చేయట్లేదని, సరైన దర్శకులను ఎంచుకోవట్లేదని చిరు విషయంలో అసంతృప్తిగా ఉన్న మెగా ఫ్యాన్స్ ఈ ప్రాజెక్టు విషయంలో ఎగ్జైట్ అవుతూ.. దీనికి అన్నీ తానై వ్యవహరించిన నానికి సోషల్ మీడియాలో ఒక రేంజిలో ఎలివేషన్లు ఇస్తున్నారు.
This post was last modified on December 4, 2024 2:26 pm
టాలీవుడ్ లో ప్రస్తుతం ఎక్కడ చూసిన పుష్ప మానియా నడుస్తోంది. మూవీ ప్రమోషన్స్ కోసం చిత్ర బృందం, అల్లు అర్జున్..…
`సీజ్ ది షిప్` - గత నాలుగు రోజులుగా ఏపీలో వినిపిస్తున్న `డైలాగ్` ఇది! ఇటు సోషల్ మీడియాలోనూ.. అటు…
ఏపీలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. సూపర్ సిక్స్ హామీలను సీఎం…
ప్యాన్ ఇండియా స్థాయిలో సంచలనంగా మారిన 'పుష్ప 2: ది రూల్' సెగలు పక్క రాష్ట్రం కర్ణాటకలో బలంగా తగిలాయి.…
మరికొద్ది గంటల్లో 'పుష్ప 2: ది రూల్' ప్రీమియర్లు మొదలుకాబోతున్న తరుణంలో మెగా బ్రదర్ నాగబాబు ఒక ట్వీట్ చేయడం…
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మంత్రి సుభాష్‌పై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారా? మంత్రి వ్యవహార శైలిపై…