Movie News

ఓదెలకే ఇలా ఉందే.. ఇంక వంగా వస్తే..?

పదేళ్ల పాటు సినీ రంగానికి దూరంగా ఉన్న చిరు.. తిరిగి కెమెరా ముందుకు వచ్చేసరికి పరిస్థితులు చాలా మారిపోయాయి. రీఎంట్రీలో ఆయన అభిమానులు పూర్తి స్థాయిలో సంతృప్తి పరచలేకపోయారు. పునరాగమన చిత్రం కాబట్టి ‘ఖైదీ నంబర్ 150’ బాగా ఆడింది కానీ.. రీమేక్‌తో రీఎంట్రీ ఇవ్వడం ఫ్యాన్సుకు నచ్చలేదు. ‘సైరా’తో భారీ ప్రయత్నం చేశారు కానీ.. అదీ సంతృప్తినివ్వలేదు.

ఆచార్య, భోళా శంకర్ ఎంత పెద్ద డిజాస్టర్లయ్యాయో తెలిసిందే. ‘వాల్తేరు వీరయ్య’ కూడా పూర్తి సంతృనిచ్చిన సినిమా కాదు. కాకపోతే సంక్రాంతి టైమింగ్ కలిసొచ్చి ఆ సినిమా బాగా ఆడింది. ‘గాడ్ ఫాదర్’ కూడా నిరాశపరిచింది. ‘విశ్వంభర’ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు కానీ.. ఈ మధ్య రిలీజైన టీజర్ మిశ్రమ అనుభూతిని మిగిల్చింది. దీంతో తమకు కిక్కిచ్చే సరైన సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్టు అలాంటిదే అయింది.న్యూ ఏజ్ సినిమాలు తీసే నవతరం దర్శకులతో చిరు జట్టు కట్టాలన్నది అభిమానుల ఆకాంక్ష. ఆయన మాత్రం మాస్ మాస్ అంటూ ఓల్డ్ స్టయిల్లో సినిమాలు చేస్తున్నారు. మాస్ టచ్ ఉండాలి కానీ.. కథల్లో, టేకింగ్‌లో కొత్తదనం చూపించే దర్శకులతో సినిమాలు చేస్తే చిరును క ొత్తగా ప్రెజెంట్ చేస్తారన్నది అభిమానుల అభిప్రాయం. ఫ్యాన్స్ ఇప్పుడు చిరును వింటేజ్ స్టయిల్లో చూడాలనుకోవట్లేదు. ఆయన్ని సరికొత్త అవతారాలు, పాత్రల్లో చూడాలనుకుంటున్నారు.

‘దసరా’తో నానిని సరికొత్తగా చూపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన శ్రీకాంత్ ఓదెల.. చిరును ఇంకెలా చూపించి షాకిస్తారో అని ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. రీఎంట్రీ తర్వాత చిరు అభిమానులను అత్యంత ఎగ్జైట్ చేసిన ఫ్రాజెక్టుల్లో ఇదొకటనడంలో సందేహం లేదు. శ్రీకాంత్ చిరుకు వీరాభిమాని కావడం వారిని చాలా ఎగ్జైట్ చేస్తోంది. ఐతే ఓదెల విషయంలోనే ఇంత ఎగ్జైట్ అవుతుంటే మరో ఫ్యాన్ బాయ్ సందీప్ రెడ్డి వంగ ఆయనతో జట్టు కడితే ఎలా ఉంటుందో అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. చిరు మీద పలు సందర్భాల్లో తన అభిమానాన్ని చాటాడు వంగ. గతంలో శ్రీకాంత్‌తో కలిసి చిరును వంగ కలవడం విశేషం. ఆ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతోంది.

ఒక ఫ్యాన్ బాయ్‌కి ఛాన్స్ ఇచ్చిన చిరు.. వంగతో కూడా జట్టు కట్టే అవకాశాలున్నాయని.. కాకపోతే కొంచెం టైం పడుతుందని అంటున్నారు. నిజంగా వంగ-చిరు కాంబోలో సినిమా వస్తే మాత్రం మెగా ఫ్యాన్స్‌కు అంతకంటే ఆనందం మరొకటి ఉండదు.

This post was last modified on December 4, 2024 1:02 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

డిప్యూటీ సీఎం పదవికి ఓకే చెప్పిన షిండే!

మహారాష్ట్రకు మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే భావించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చివరి వరకు…

22 mins ago

లోకేశ్ కి రుణపడ్డానంటోన్న డ్రైవర్ లోవరాజు!

ఐటీ శాఖా మంత్రిగా నారా లోకేశ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ప్రజా దర్బార్ నిర్వహిస్తోన్న సంగతి…

55 mins ago

పెళ్లి ఫోటోస్ :- నాగ చైతన్య – శోభిత ధూళిపాళ్ల వైభవమైన వివాహం!

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ఈరోజు ఓ ఇంటివాడయ్యాడు. గత కొంతకాలంగా ప్రేమిస్తున్న శోభిత ధూళిపాలతో ఈరోజు ఏడడుగులు నడిచాడు.…

1 hour ago

పుష్ప 2 ప్రమోషన్ల కోసం ప్రాణం పెట్టిన శ్రీవల్లి!

టాలీవుడ్ లో ప్రస్తుతం ఎక్కడ చూసిన పుష్ప మానియా నడుస్తోంది. మూవీ ప్రమోషన్స్ కోసం చిత్ర బృందం, అల్లు అర్జున్..…

3 hours ago

`సీజ్ ది షిప్‌`: తెలుగు సినిమా టైటిల్ రిజిస్ట్రేష‌న్‌!

`సీజ్ ది షిప్‌` - గ‌త నాలుగు రోజులుగా ఏపీలో వినిపిస్తున్న `డైలాగ్‌` ఇది! ఇటు సోష‌ల్ మీడియాలోనూ.. అటు…

4 hours ago