ధనుష్ కి తెలుగులో మార్కెట్ ఏర్పడేందుకు దోహదపడిన సినిమా రఘువరన్ బిటెక్. అనిరుధ్ రవిచందర్ మేజిక్ మొదలయ్యింది కూడా ఇక్కడి నుంచే. అందులో ఇంజనీరింగ్ చదివి ఖాళీగా ఉండే తెలివైన కుర్రాడిగా ధనుష్ పాత్ర టాలీవుడ్ యువతకు బాగా ఎక్కేసింది. పెద్దగా అంచనాలు లేకుండా రిలీజై సూపర్ హిట్ అందుకుంది. కొన్ని సెంటర్స్ లో వంద రోజులు ఆడింది. ఆ తర్వాత తనకు వెనుదిరిగి చూడాల్సిన అవసరం పడలేదు. ఆపై తన స్థాయి బ్లాక్ బస్టర్ దక్కకపోయినా ధనుష్ డబ్బింగ్ మూవీస్ క్రమం తప్పకుండా వస్తూనే ఉన్నాయి. ఆ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ప్రభావం అంతలా ఉంది.
రీ రిలీజుల ట్రెండ్ క్రమంగా తగ్గిందనుకుంటున్న టైంలో రఘువరన్ బిటెక్ మళ్ళీ థియేటర్లకు వస్తోంది. జనవరి 4న ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్టు ప్రకటించారు. దీని గురించి ప్రత్యేకంగా చెప్పడానికి కారణముంది. ధనుష్ 3 మొదటిసారి విడుదలైనప్పుడు పెద్ద డిజాస్టర్. కానీ గత ఏడాది కాలంలో రెండు మూడుసార్లు రిలీజ్ చేస్తే వసూళ్ల వర్షం కురిసింది. కాలేజీ కుర్రకారు ఎగబడి చూశారు. హైదరాబాదే కాదు చిన్న సెంటర్లలోనూ వసూళ్లు తెప్పించి డిస్ట్రిబ్యూటర్ జేబు నింపింది. దానికే అంత స్పందన వచ్చినప్పుడు నిజమైన కల్ట్ గా నిలిచిన రఘువరన్ బిటెక్ కు ఏ స్థాయి రెస్పాన్స్ వస్తుందో ఊహించుకోవచ్చు.
తెలివిగా సంక్రాంతి హడావిడికి ఆరు రోజుల ముందు రిలీజ్ చేయడం మంచి మార్కెటింగ్ స్ట్రాటజీ. జనవరి 10 గేమ్ ఛేంజర్ నుంచి ఎలాగూ థియేటర్లు పూర్తిగా పండగ సినిమాలకు అంకితమవుతాయి. దానికి ముందు వారం ఖాళీగా ఉంటుంది కాబట్టి ఎంతో కొంత ఫీడింగ్ కు రఘువరన్ బిటెక్ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇందులో పాటలకు పెద్ద రీచ్ ఉంది. చూడండి సారూ, పోపోవే ఏకాంతంతో పాటు మదర్ సెంటిమెంట్ సాంగ్ అప్పట్లో చార్ట్ బస్టర్స్. ఇంతగా మేజిక్ చేసింది కాబట్టే మళ్ళీ వర్కౌట్ అవుతుందన్న నమ్మకంతో తీసుకొస్తున్నారు. ఇప్పుడెలా రిసీవ్ చేసుకుంటారనేది వేచి చూడాలి.
This post was last modified on December 4, 2024 11:52 am
‘బాహుబలి: ది బిగినింగ్’కు పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేసినపుడు బాలీవుడ్ నుంచి మంచి సపోర్టే లభించింది. కరణ్ జోహార్…
తిరుమల తోపులాట ఘటనలో ఆరుగురు భక్తులు చనిపోయిన ఘటనపై ఏపీలోని కూటమి ప్రభుత్వం వేగంగా స్పందించింది. బుధవారం విశాఖ పర్యటనకు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఒక్క తెలుగు రాష్ట్రాలే కాదు… దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు విదేశాల…
అభిమానులు ఆతృతగా ఎదురు చూసిన అన్ స్టాపబుల్ 4 నుంచి బాలకృష్ణ - రామ్ చరణ్ ఎపిసోడ్ నిన్న సాయంత్రం…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం ఉదయం ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఫార్ములా…
నిజమే. ఓ వైపు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత బుధవారం రాత్రి ఘోర విషాదం చోటుచేసుకుంది. అనూహ్యంగా…