2010 లో పోర్కిలో దర్శన్ అనే కన్నడ మూవీతో సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది ప్రణిత సుభాష్. అదే సంవత్సరం తెలుగులో ఎమ్ పిల్లో ఎమ్ పిల్లాడో అనే మూవీతో అడుగుపెట్టింది. అయితే ఆమెకు సిద్ధార్థ బావ చిత్రంతో మంచి గుర్తింపు లభించింది.అత్తారింటికి దారేది,రభస,బ్రహ్మోత్సవం లాంటి చిత్రాలలో ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది.