ఒకప్పుడు విరామం లేకుండా సినిమాలు చేసిన దగ్గుబాటి రానా.. ఇప్పుడు ఖాళీగా ఉన్నట్లు కనిపిస్తోంది. ‘విరాట పర్వం’ తర్వాత అతను హీరోగా నటించిన సినిమా ఏదీ రిలీజ్ కాలేదు. ‘స్పై’ మూవీలో క్యామియో రోల్, ‘వేట్టయాన్’ల విలన్ పాత్రల్లో మెరిసిన అతను.. హీరోగా మాత్రం ఏ సినిమా కన్ఫమ్ చేయట్లేదు. చాన్నాళ్ల ముందే ఓకే అయిన సినిమాలు ఏవీ ఇప్పట్లో పట్టాలెక్కే సంకేతాలు ఏమీ కనిపించడం లేదు. దీంతో రానా ఫ్యాన్స్ ఒకింత నిరాశ చెందుతున్నారు. ప్రస్తుతం అమేజాన్ ప్రైమ్ కోసం టాక్ షో చేస్తున్న రానా.. తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి తాజాగా క్లారిటీ ఇచ్చాడు. తన నుంచి మూడు క్రేజీ ప్రాజెక్టులు వస్తాయని.. కానీ వాటికి కొంచెం టైం పడుతుందని అతను స్పష్టత ఇచ్చాడు.
రానా డ్రీమ్ ప్రాజెక్టు అయిన ‘హిరణ్య కశ్యప’ను చాన్నాళ్ల కిందటే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ముందు గుణశేఖర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తాడన్నారు. ఆయన ఈ ప్రాజెక్టు మీద చాన్నాళ్లు పని చేశారు. కానీ తర్వాత ఆయన్ని తప్పించేశారు. త్రివిక్రమ్ ఈ సినిమాకు స్క్రిప్టు అందిస్తుండగా.. దర్శకుడిని ఓకే చేసి సినిమాను పట్టాలెక్కించాల్సి ఉంది. దీని గురించి రానా మాట్లాడుతూ.. ఇది చాలా పెద్ద స్కేల్‌లో చేయాల్సిన సినిమా అని.. అమర్ చిత్ర కథల నుంచి స్క్రిప్టు తీసుకున్న తాము… ప్రి ప్రొడక్షన్ అంతా పూర్తి చేసి సినిమాను మొదలుపెడతామని చెప్పాడు.
ఇక తేజతో చేయాల్సిన ‘రాక్షస రాజు’ గురించి చెబుతూ.. తమ కలయికలో ఇంతకుముందు వచ్చిన ‘నేనే రాజు నేనే మంత్రి’ పెద్ద హిట్టయిందని.. దానికి ఏమాత్రం తగ్గని విధంగా ఈ సినిమా చేయాల్సి ఉందని.. కథ కూడా ఆ స్టయిల్లోనే ఉంటుందని.. ఇంకా బాగా చేయాలనే లక్ష్క్ష్యంతోనే టీం పని చేస్తోందని.. అందుకే ఇది కూడా ఆలస్యం అవుతోందని రానా తెలిపాడు. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో తాను చేయాల్సిన ఓ సినిమా కూడా కచ్చితంగా ఉంటుందని.. ఆయన కూడా ప్రస్తుతం బిజీగా ఉన్నాడని.. కానీ తమ కలయికలో సినిమా మాత్రం వస్తుందని రానా కన్ఫమ్ చేశాడు. బహుశా వచ్చే ఏడాది రాక్షస రాజు, హిరణ్య కశ్యప ఒకదాని తర్వాత ఒకటి మొదలు కావచ్చేమో. త్రివిక్రమ్‌తో రానా సినిమాకు మాత్రం బాగానే టైం పట్టొచ్చు.
This post was last modified on December 3, 2024 6:06 pm
పదేళ్ల పాటు సినీ రంగానికి దూరంగా ఉన్న చిరు.. తిరిగి కెమెరా ముందుకు వచ్చేసరికి పరిస్థితులు చాలా మారిపోయాయి. రీఎంట్రీలో…
కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కూటమి సర్కారు ఉక్కుపాదం మోపుతోంది. ప్రత్యేక భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తూ,…
ధనుష్ కి తెలుగులో మార్కెట్ ఏర్పడేందుకు దోహదపడిన సినిమా రఘువరన్ బిటెక్. అనిరుధ్ రవిచందర్ మేజిక్ మొదలయ్యింది కూడా ఇక్కడి…
మరికొద్ది గంటల్లో పుష్ప 2 ది రూల్ సంభవం జరగనుంది. రాత్రి 9 గంటల 30 నిమిషాలకు పుష్పరాజ్ భీభత్సం…
2010 లో పోర్కిలో దర్శన్ అనే కన్నడ మూవీతో సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది ప్రణిత సుభాష్. అదే సంవత్సరం…
ప్రతిపక్ష వైసీపీ నాయకులు తరచుగా సీఎం చంద్రబాబుపై చేస్తున్న విమర్శలకు ఇప్పుడు ఆయన చెక్ పెట్టనున్నారు. రాజధానిలో చంద్రబాబుకు సొంత…