బిగ్‍బాస్‍ సీక్రెట్స్ అన్నీ బట్టబయలు

బిగ్‍బాస్‍ షోకి సంబంధించి ఆడియన్స్ కి సస్పెన్స్ ఏమైనా వుంటే అది ఎవరు ఎలిమినేట్‍ అవుతారనే అంశం ఒక్కటే. ప్రతి వారం ఎవరు ఎలిమినేట్‍ అయ్యేదీ ముందే లీక్‍ అయిపోతోంది. శని, ఆదివారాలలో వచ్చే ఎపిసోడ్స్ శనివారమే షూట్‍ చేస్తుంటారు కనుక ఎలిమినేషన్‍ న్యూస్‍ ఒక రోజు ముందే బయటకు వస్తోంది. దీంతో గత రెండు వారాలలో లీక్స్ బయటకు రాకుండా కన్‍ఫ్యూజన్‍ క్రియేట్‍ చేసారు.

అయినా కానీ దేవి ఎలిమినేషన్‍ విషయంలో క్రియేట్‍ అయిన కన్‍ఫ్యూజన్‍ స్వాతి ఎలిమినేషన్‍ అప్పుడు రాలేదు. ఇప్పుడు కేవలం ఎలిమినేషన్‍ న్యూస్‍ మాత్రమే కాదు కెప్టెన్‍గా ఎవరు గెలిచారనే విషయాలు కూడా ముందే లీక్‍ అవుతున్నాయి. బిగ్‍బాస్‍లో మనకు చూపించేది ఎప్పుడూ ఒక రోజు డిలేతో వుంటుంది. అంటే ఆదివారం జరిగినది సోమవారం, సోమవారం జరిగినది మంగళవారం చూపిస్తుంటారు. అలా హౌస్‍లోని ఇంటర్నెల్‍ విషయాలు కూడా ఇప్పుడు లీక్‍ అవుతున్నాయి.

గతవారం కెప్టెన్‍గా కుమార్‍ సాయి గెలిచాడని ముందే లీక్‍ అవగా, ఈసారి సోహైల్‍ కెప్టెన్‍ అయ్యాడని లీకయింది. ఇంకా పది వారాల షో వుంది కనుక ఈ లీకులకు అడ్డుకట్ట వేయకపోతే ప్రేక్షకుల ఆసక్తి మరింత సన్నగిల్లిపోతుంది. ఇలాంటి లీక్స్ ఎవరి వల్ల బయటకు వెళుతున్నాయనేది గుర్తించి వారికి గట్టి వార్నింగ్‍ ఇస్తే సరి.