కరోనా కల్లోలంలో చాలా మంది దర్శకులు, హీరోల ప్లాన్స్ భగ్నమయ్యాయి. వరుస హిట్లు కొడుతోన్న అనిల్ రావిపూడి తన ‘ఎఫ్ 3’ సినిమా మొదలు పెట్టే వీల్లేని సిట్యువేషన్‍లో పడ్డాడు. వెంకటేష్, వరుణ్ తేజ్ ఇద్దరూ వచ్చే ఏప్రిల్ తర్వాతే అందుబాటులోకి వస్తారు. మిగతా హీరోలంతా కూడా బిజీగా వున్నారు. దీంతో ఎప్పట్నుంచో తన దగ్గరున్న ఒక హీరోయిన్ సెంట్రిక్ కథను తెరకెక్కించాలని రావిపూడి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
హీరోయిన్ ప్రధాన కథ అయినా కానీ తన మార్కు వినోదం, కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అవని వెరైటీ కాన్సెప్ట్ అట. ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ అయితే బాగుంటుందని ఆమెను కాంటాక్ట్ చేసినట్టు సమాచారం. సాయి పల్లవి ఈమధ్య ఎక్కువ సినిమాలు సైన్ చేస్తోంది. గతంలో తన పాత్ర, కథ విషయంలో ఆమె చాలా ఖచ్చితంగా వుండేది కానీ ఇప్పుడు కొంచెం అటు, ఇటు అయినా ఓకే అనేస్తోంది.
అనిల్ రావిపూడి లాంటి సక్సెస్‍ఫుల్ దర్శకుడు, హీరోయిన్ ప్రధాన సినిమా అంటే ఆమె నో చెప్పడానికి రీజన్ ఏమీ లేదు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించే అవకాశాలున్నాయి. ప్రస్తుతానికి చర్చల దశలో వున్న ఈ చిత్రం అన్నీ ఓకే అయితే త్వరలోనే అనౌన్స్ కావచ్చు.
This post was last modified on October 8, 2020 4:01 pm
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…