నాగ చైతన్య తమ అన్నపూర్ణ, మనం ఎంటర్‍టైన్‍మెంట్స్ కి సంబంధం లేకుండా స్వయంగా ఒక నిర్మాణ సంస్థ మొదలు పెడుతున్నాడని ఎప్పట్నుంచో వార్తలొస్తున్నాయి. భారీ చిత్రాలు కాకుండా ఒక లో బడ్జెట్ సినిమాతో చైతన్య సంస్థ మొదలవుతుందని, మొదటి సినిమాలో రాజ్ తరుణ్ హీరోగా నటిస్తాడని కూడా న్యూస్ వచ్చింది. ఒరేయ్ బుజ్జిగా క్లిక్ అయినట్టయితే ఈ చిత్రం చేసి వుండేవాడో లేదో తెలియదు కానీ ఇప్పుడయితే రాజ్ తరుణ్‍తో సినిమా చైతన్య డ్రాప్ అయినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
చూస్తూ, చూస్తూ ఫ్లాప్స్లో వున్న హీరోతో సినిమా ఎందుకనుకున్నాడో, లేక లాక్‍డౌన్ వల్ల తన సినిమాలు డిలే అవడం వల్ల ఇప్పుడు నిర్మాణం చేసే తీరిక లేదో తెలియదు కానీ నాగచైతన్య సొంత బ్యానర్ మొదలు కావడానికి మరికొన్నాళ్లు పడుతుంది. ఇక రాజ్ తరుణ్ విషయానికి వస్తే అతడికి జనాకర్షణ బాగా తగ్గిపోయిందనే ఫీలింగ్ నిర్మాతలకు వచ్చేయడంతో అతడితో మూవీస్ ప్లాన్ చేసిన నిర్మాతలు కూడా వెనకాడుతున్నారు. పెద్ద నిర్మాతలకు రెమ్యూనరేషన్ లేకుండా చేయడానికి కూడా అతను సిద్ధంగా వున్నా కానీ సినిమాపై పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చే పరిస్థితి కనిపించక ఎవరూ ముందుకు రావడం లేదట.
This post was last modified on October 8, 2020 4:00 pm
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…
ఇప్పటి వరకు పీపీపీ మోడల్ గురించే ప్రజలకు తెలుసు. అయితే.. తొలిసారి ఏపీలో పీపీపీపీ అనే 4-పీ ఫార్ములాను సీఎం…