మహేష్, త్రివిక్రమ్ ఒకప్పుడు మంచి స్నేహితులే కానీ మధ్యలో చిన్నపాటి విబేధాలు వచ్చాయి. దాంతో పదేళ్లుగా ఈ కాంబినేషన్‍లో మరో సినిమా రాలేదు. అయితే సినీ పరిశ్రమలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు వుండరనేది తెలిసిన విషయమే. ఇటీవలే ఈ ఇద్దరి మధ్య ప్యాచప్ జరిగిపోయింది. మళ్లీ త్రివిక్రమ్‍తో సినిమా చేయాలనే ఆకాంక్షను మహేష్ వెలిబుచ్చగా, అతనికో కథ చెప్పిన త్రివిక్రమ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ పొందాడు. అయితే ఎన్టీఆర్‍తో సినిమా చేయడానికి త్రివిక్రమ్ కమిట్ అయి వుండడంతో ఈ కాంబినేషన్లో సినిమా ఎప్పుడు మొదలవుతుందనే విషయంలో సస్పెన్స్ నెలకొంది.
త్రివిక్రమ్ ఇప్పుడున్న రేంజ్‍కి అతడిని లాక్ చేయడానికి మహేష్ తెలివిగా వ్యవహరించాడు. ఖలేజా పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తన ఆనందాన్ని వెలిబుచ్చుతూ త్రివిక్రమ్‍తో అతి త్వరలో సినిమా వుంటుందని ప్రకటించాడు. దీంతో అధికారికంగా త్రివిక్రమ్ ఈ సినిమాకు లాక్ అయినట్టయింది. ఎన్టీఆర్‍తో సినిమా ముందు చేస్తాడో, తర్వాత చేస్తాడో తెలియదు కానీ ఇతర కమిట్‍మెంట్స్ ఏమీ లేకుండా త్రివిక్రమ్ తన సినిమాకు కట్టుబడేలా మహేష్ ఈ ప్రకటన ఇచ్చాడు. సూపర్‍స్టార్ స్వయంగా ప్రాజెక్ట్ అనౌన్స్ చేసేసిన తర్వాత ఇక ఎవరైనా ఎలా వెనకడుగు వేయగలరు?
Gulte Telugu Telugu Political and Movie News Updates