ఐకాన్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూసిన ఘట్టం జరిగిపోయింది. నిన్నటిదాకా పక్క రాష్ట్రాల్లో జరిగిన పుష్ప 2 ప్రమోషన్లను యూట్యూబ్ లో చూసిన ఫ్యాన్స్ నేరుగా తమను ఎప్పుడు కలుస్తాడాని వెయిట్ చేశారు. వాళ్ళ నిరీక్షణ ఫలిస్తూ హైదరాబాద్ లో జరిగిన వైల్డ్ ఫైర్ మాస్ జాతరలో బన్నీ మాట్లాడాడు. సాధారణంగా జరిగే ఈవెంట్లకు భిన్నంగా ఈసారి కొంత ఆలస్యం కావడంతో హీరో స్పీచ్ ఏకంగా రాత్రి పదకొండుగంటలకు జరగడం అరుదు. అయినా అంత సేపు చలిలో వేలాది ఫ్యాన్స్ గ్రౌండ్ లోనే ఉండటం విశేషం. ఒక ఫ్యాన్ ఏకంగా స్టేజి మీదకు దూసుకొస్తే బన్నీ ఫోటో ఇచ్చాడు.
ఇక తన ప్రసంగంలో అల్లు అర్జున్ థాంక్స్ చెప్పడానికి మాత్రమే పరిమితం కావడం తప్ప ఏమి చేయలేనని చెబుతూ టెక్నీషియన్లు, నటీనటులు, నిర్మాతల గురించి ప్రస్తావించాడు. ముఖ్యంగా క్యూబా, దేవిశ్రీ ప్రసాద్, రవి శంకర్, నవీన్ యెర్నేనిలతో పాటు చెర్రీకి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాడు. రష్మిక మీద పొగడ్తల వర్షం కురిపించాడు. రెండు రోజులు వరసగా నిద్ర లేకుండా పీలింగ్స్ పాట కోసం కష్టపడటం చూశానని, ప్రొఫెషనలిజం ఉంటే తప్ప అంత అంకిత భావం ఉండదని, అయిదు సంవత్సరాలు కలిసి పని చేయడం గురించి జ్ఞాపకాలు పంచుకున్నాడు. శ్రీలీల చలాకీదనం వర్ణించడం మరో హైలైట్.
సుకుమార్ గురించి చెబుతూ మూడు సందర్భాల్లో పుష్ప 2 బలంగా ఆడాలని కోరుకున్నానని, యూనిట్ లో ఉన్న ప్రతి ఒక్కరు మూడేళ్లు తమ జీవితాన్ని త్యాగం చేశారని వాటి గురించి చెప్పుకొచ్చాడు. ఆర్యతో మొదలైన అనుబంధం సుకుమార్ ని తన జీవితంలో భాగం చేసిందన్న అల్లు అర్జున్ ఒకసారి సుక్కు ఒత్తిడికి బ్రేక్ డౌన్ అయితే ఆయన కోసమే ఈ సినిమా బ్లాక్ బస్టరవ్వాలని కోరుకున్నానని చెప్పాడు. చాలా హైగా ప్రిపేరై వస్తే భావోద్వేగం వల్ల స్పీచ్ మార్చుకోవాల్సి వచ్చిందని, 12 వేలకు పైగా స్క్రీన్లలో విడుదల కాబోతున్న పుష్ప 2 ఖచ్చితంగా అలరిస్తుందని గ్యారెంటీ ఇస్తూ బన్నీ ప్రసంగం ముగిసింది.
This post was last modified on December 2, 2024 11:49 pm
ట్రాఫిక్ చలాన్ వచ్చిందంటే వెంటనే కట్టేవాళ్లు కొందరైతే.. నెలలు, ఏళ్లుగా పెండింగ్‌లో పెట్టేవాళ్లు కూడా ఉన్నారు. ఇలా దేశవ్యాప్తంగా వసూలు…
ప్రస్తుతం ఇండియాలో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే ఎక్కువమంది చెప్పే పేరు.. అనిరుధ్ రవిచందర్‌దే. పేరుకు తమిళ…
రాష్ట్రంలో మంగళగిరి నియోజకవర్గం అత్యంత కీలకంగా మారింది. తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రసిడెంట్, విద్యా శాఖ మంత్రి నారా…
ఇంకో రెండు వారాల్లో దసరా పండగ రానుంది. సెలవుల సీజన్ కావడంతో పిల్లా పెద్ద అందరూ ఎదురు చూస్తున్నారు. బయ్యర్…
మొన్నటిదాకా ఇండస్ట్రీలో ఒకటే గుసగుస. ఏఐ వచ్చేసిందిగా, ఇకపై గ్రాఫిక్స్ కోసం కోట్లు తగలేయాల్సిన పనేముంది అని చాలామంది లెక్కలేసుకున్నారు.…
దర్శకుడు పూరి జగన్నాథ్ కొత్త సినిమా 'స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్' విడుదల వ్యవహారం ఇంకా తేలలేదు. నిన్న…