హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరిగిన పుష్ప 2 ది రూల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మాస్ జాతరలో అల్లు అరవింద్ తన పుత్రోత్సాహాన్ని పంచుకున్నారు. వారం రోజుల క్రితమే సినిమా చూశానని, షో అయ్యాక ఇంట్లో భార్య పలకరించి మొహం ఏంటి ఇంత వెలిగిపోతుందని అడిగారట. దానికి సమాధానంగా అరవింద్ పుష్ప 2 బాగుందని, బ్రహ్మాండంగా నచ్చిందని అన్నారట. దానికావిడ నీ మొహం ఇన్ని సంవత్సరాల్లో రెండుసార్లే ఇలా వెలగడం చూశాను, ఒకటి మగధీర రిలీజ్ కు ముందు మరొకటి ఇప్పుడు పుష్ప 2 ముందు అన్నారట. అంటే దశాబ్దాల అనుభవంలో అరవింద్ అరుదైన క్షణాలు ఇవేనన్న మాట.
మేనల్లుడు రామ్ చరణ్, కొడుకు అల్లు అర్జున్ సినిమాలకు సంబంధించిన ఆనందాన్ని అల్లు అరవింద్ ఈ రకంగా ఆస్వాదించడాన్ని అభిమానులు ఈ రోజు చూశారు. ఇలాంటి హిట్లు, బ్లాక్ బస్టర్లు గతంలో ఆయన ఎన్నో చూశారు. చిరంజీవి హీరోగా తీసిన ఎన్నో చిత్రాలు ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాయి. కానీ వాళ్లిద్దరూ ఒకే తరానికి చెందినవాళ్లు, అందులోనూ స్నేహితుల్లా మెలిగిన బావాబావమరుదులు కాబట్టి పైకి చెప్పుకోకపోయి ఉండొచ్చు. కానీ పిల్లలు సాధిస్తున్న వాటిని చూస్తూ ఆ సంతోషాన్ని వ్యక్తపరిచే సందర్భం వచ్చినప్పుడు మాత్రం వదులుకోకూడదు. అరవింద్ అదే చేశారు.
మగధీర ప్రస్తావన తేవడం ద్వారా అరవింద్ చెప్పిన మాటలు మెగా ఫ్యాన్స్ కి రీచ్ అవుతాయి. ఇప్పటికే పలు కారణాల వల్ల ఆన్ లైన్ లో కొన్ని వర్గాలు ఉప్పునిప్పు గా మారిన నేపథ్యంలో ఇలాంటివి చెప్పడం అవసరం. పుష్ప 2 గురించి వచ్చిన గెస్టులు ఇస్తున్న ఎలివేషన్లు చూస్తుంటే మాత్రం డిసెంబర్ 4 రాత్రి నుంచి థియేటర్లలో రచ్చ ఓ రేంజ్ లో ఉండబోతోందనేది అర్థమైపోయింది. అరవింద్ ఒక్కరే కాదు అతిథులుగా వచ్చిన రాజమౌళి, బుచ్చిబాబు, వివేక్ ఆత్రేయ, శివ నిర్వాణ ఒకరిని మించి మరొకరు పుష్ప 2 గురించి వర్ణిస్తూ అంతకంతా అంచనాలు పెంచేశారు. ఇక బాక్సాఫీస్ బద్దలవ్వడమే బాకీ.
This post was last modified on December 2, 2024 10:58 pm
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… ఇద్దరూ ఒకేసారి విదేశాలకు వెళుతున్నారు. అదేంటీ……
సంధ్య థియేటర్ ఘటన నుంచి క్రమంగా బయటపడుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమాల ప్రపంచంలోకి వచ్చేస్తున్నాడు. పుష్ప 3 ఉంటుందో…
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్కు అభిమానుల నుంచి తిప్పలు మామూలుగా ఉండడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా..…
ఏపీలోని కూటమి ప్రభుత్వం తనకు భయపడుతోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు భయపడుతున్న…
ఏపీ రాజకీయాల్లో ఉప్పు-నిప్పుగా వ్యవహరించే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్లు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చి ఆయన పాదాల చెంత తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు…