తెలంగాణలో టికెట్ ధరల పెంపు, జీవోలు వచ్చేసి ఆన్ లైన్ అమ్మకాలు మొదలయ్యాక కూడా ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి ఆలస్యం జరగడం ఐకాన్ స్టార్ అభిమానులను టెన్షన్ పెట్టింది. ఇదిగో అదిగో అంటూ నిన్నటి నుంచి ఊరింపులే తప్ప సరైన అప్డేట్ లేక ఆందోళన చెందారు. రావడం ఖరారే అయినప్పటికీ ఎంత మొత్తంలో హైక్ ఉంటుందనే దాని మీద రకరకాల ఊహాగానాలు చెలరేగాయి. వాటికి చెక్ పెడుతూ జీవో వచ్చేసింది. కొంచెం అటుఇటుగా తేదీలలో మార్పులతో నైజామ్ రేట్లే ఇక్కడ అమలు కాబోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకటే ధర ఉండటం చాలా ఏళ్ళ తర్వాత ఇదే.
ఇక వివరాల్లోకి వెళ్తే డిసెంబర్ 4 రాత్రి 9 గంటల 30 నిమిషాలకు వేయబోయే ప్రీమియర్లకు టికెట్ కు 800 రూపాయల చొప్పున పెంచుకోవచ్చు. దీనికి అదనంగా జిఎస్టి ఉంటుంది. డిసెంబర్ 5 రిలీజ్ రోజు మొత్తం ఆరు షోలకు పర్మిషన్ వచ్చింది. సింగల్ స్క్రీన్లలో రెండో తరగతి అదనంగా 100 రూపాయలు, మొదటి తరగతి 150 రూపాయలు అదనంగా ధర ఉంటుంది. మల్టీప్లెక్సుల్లో 200 రూపాయలు ప్రతి టికెట్ మీద ఎక్స్ ట్రా ఛార్జ్ చేయొచ్చు. డిసెంబర్ 6 నుంచి ఇవే ధరలతో అయిదు షోలు కొనసాగుతాయి. ఈ రేట్లన్నీ డిసెంబర్ 17 వరకు అమలులో ఉంటాయి. మూడో వారం నుంచి సాధారణ స్థితి.
సో ఏ క్షణమైనా ఏపీ టికెట్ బుకింగ్స్ ఆన్ లైన్ లో పెట్టేస్తారు. ఇప్పటికీ అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డుల వేట మొదలుపెట్టిన పుష్పరాజ్ రేపటి నుంచి నమోదు చేయబోయే నెంబర్లకు మతులు పోవడం ఖాయం. ముఖ్యంగా ధర ఎక్కువగా ఉన్నా సరే ప్రీమియర్ షోల టికెట్లు హాట్ కేకుల్లా మారిపోతున్నాయి. ఇంకా యాప్స్ లో పెట్టనప్పటికీ థియేటర్ యాజమాన్యాల మీద ఒత్తిడి మొదలైపోయింది. జిఓ ఇచ్చిన సందర్భంగా అల్లు అర్జున్ వెంటనే ఏపీ సిఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేయడం విశేషం. పెద్ద సస్పెన్స్ కు తెరపడిపోయింది. ఇక ఫ్యాన్స్ రిలాక్స్ అవ్వొచ్చు.
This post was last modified on December 3, 2024 11:33 am
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…