Movie News

ఊహించని మెగా క్యామియోతో OG?

పవన్ కళ్యాణ్ అభిమానులు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా కనీసం ఒక్కసారైనా తలవకుండా ఉండలేని పేరు ఓజి. సుజిత్ దర్శకత్వంలో డివివి ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా మీద విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ముందు రిలీజయ్యేది హరిహర వీరమల్లే అయినా ఫ్యాన్స్ మాత్రం ఓజినే డిమాండ్ చేస్తున్నారు. త్వరలోనే బ్యాలన్స్ షూటింగ్ కి ఏర్పాట్లు చేసుకుంటున్న టీమ్ జనవరి లేదా ఫిబ్రవరిలో గుమ్మడికాయ కొట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో ఒక కీలకమైన క్యామియో గురించి గత రెండు మూడు రోజులుగా ప్రచారం జరుగడం చూస్తున్నాం.

ప్రభాస్ అని ఒకరు కాదు నాని అని మరొకరు ఇలా ఏదేదో తిరుగుతోంది కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ పాత్ర చేయబోయేది ఈ ఇద్దరు కాదట. బాబాయ్ అబ్బాయి మొదటిసారి కలయికని సాధ్యం చేస్తూ దర్శకుడు సుజిత్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ని ఒప్పించిన్నట్టు లేటెస్ట్ అప్డేట్. కొన్ని నెలల క్రితమే దీనికి సంబంధించిన చర్చ జరిగిందని, తక్కువ కాల్ షీట్ కాబట్టి అవసరమైనప్పుడు అడిగితే ఇస్తానని హామీ ఇచ్చాడట. దానికి అనుగుణంగానే త్వరలోనే దీన్ని షూట్ చేయొచ్చని అంటున్నారు. అధికారిక ప్రకటన లాంటిదేదీ లేదు కానీ ఇన్ సైడ్ టాక్ ఊరికే వచ్చిన గాలి మాట అయితే కాదు.

ఇది నిజమైతే కనక థియేటర్లు బ్లాస్ట్ కావడం ఖాయం. ఓజిలో పవన్ కళ్యాణ్ హీరోయిజంకి కొన్ని నిమిషాలే అయినా చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ తోడైతే రోలెక్స్ రేంజ్ లో ఆ ఎపిసోడ్ కు పూనకాలు వచ్చేస్తాయి. 2025లో ఎప్పుడు విడుదల చేయాలనే నిర్ణయం ఇంకా తీసుకోలేదు కానీ పోస్ట్ ప్రొడక్షన్ కు ఎక్కువ సమయం పట్టేలా ఉంది. క్వాలిటీ విషయంలో సుజిత్ రాజీ పడకుండా చూసుకుంటున్నాడు. విఎఫెక్స్ డిమాండ్ చేసే సబ్జెక్టు కాకపోయినా విజువల్స్ నుంచి యాక్షన్ బ్లాక్స్ దాకా ప్రతిదీ శ్రద్ధతో తీర్చిదిద్దుతున్నాడట. సంక్రాంతికి టీజర్ లేదా పాట రూపంలో ఏదైనా కీలక అప్డేట్ వచ్చే అవకాశం లేకపోలేదు.

This post was last modified on December 2, 2024 2:08 pm

Share

Recent Posts

కాంగ్రెస్ వైపు జగన్ అడుగులు?

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ రూటు మాసరుస్తున్నారా..? నిన్నా మొన్నటి వరకు ప్రధాని మోదీకి నమ్మకమైన వ్యక్తిగా కొనసాగిన…

58 minutes ago

పంజాబ్‌ చిత్కార యూనివ‌ర్సిటీలో ఏం జరుగుతుంది?

పంజాబ్‌లోని పాటియాలా జిల్లాలో ఉన్న‌ చిత్కార యూనివర్సిటీలో దెయ్యం ఉందంటూ సోషల్ మీడియాలో వ్యాపించిన ఒక పుకారు తీవ్ర ఉద్రిక్తతకు…

2 hours ago

ఉన్న కాస్త సింపతీ పోతుంది జగన్

ఒక పార్టీపై చ‌ర్య‌లు తీసుకున్నా.. ఒక పార్టీ నాయ‌కుడిపై చ‌ర్య‌లు తీసుకున్నా.. స‌హ‌జంగానే ప్ర‌జ‌ల్లో అంతో ఇంతో సింప‌తీ ద‌క్కుతుంది.…

2 hours ago

విజ‌య‌వాడ సెంట్ర‌ల్ రాజ‌కీయం మామూలుగా లేదే.. !

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం రాజ‌కీయాలు కూట‌మిలోనే అంత‌ర్గ‌త వివాదాల‌కు కేంద్రంగా మారుతోంది. ఈ నియోజ‌క‌వ‌ర్గం పూర్తిగా ప‌ట్ట‌ణ ప‌రిధిలో ఉంది.…

3 hours ago

ఆలస్యం ‘ఆదర్శం’ కాకుంటే చాలు

ఫిలిం నగర్ వర్గాల్లో కొత్త ప్రచారం వెంకటేష్ అభిమానులను టెన్షన్ కు గురి చేస్తోంది. అక్టోబర్ 2 నుంచి ఆల్రెడీ…

8 hours ago

బీఆర్ఎస్‌కు క‌ష్ట కాల‌మా… న‌ష్ట కాల‌మా?!

దానం నాగేంద‌ర్‌పై వేటు ప‌డ‌డం.. ఖైర‌తాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావ‌డం.. ఇటీవ‌ల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…

12 hours ago