నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ తెరంగేట్రం ఇటీవలే మొదలైన సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందబోయే యాక్షన్ కం ఫాంటసీ డ్రామా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే మోక్షజ్ఞ ప్రీ లుక్స్ ఫోటోలు ఫ్యాన్స్ మధ్య హాట్ టాపిక్ గా మారాయి. గతంలో చూసినదానికి ఇప్పటికి బోలెడు వ్యత్యాసం చూపించడంతో కుర్రాడి మీద ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో జూనియర్ బాలకృష్ణతో సినిమా చేసేందుకు దర్శక నిర్మాతలు ఉత్సాహం చూపిస్తున్నారు. తాజాగా రెండో ప్రాజెక్ట్ లాక్ అయ్యే దిశగా ఉందని సమాచారం.
వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ ఒక భారీ చిత్రానికి రంగం సిద్ధం చేస్తోందని తెలిసింది. డాకు మహారాజ్ షూటింగ్ జరుగుతున్న టైంలోనే నిర్మాత నాగవంశీ బాలయ్యకు వెంకీ అట్లూరి నెరేషన్ ఇప్పించారట. అప్పటికే లక్కీ భాస్కర్ చూసి ఉండటంతో కథ నచ్చిన బాలకృష్ణ సానుకూలంగా స్పందించి ఫుల్ వెర్షన్ సిద్ధం చేసుకోమని చెప్పారని తెలిసింది. అనౌన్స్ మెంట్ ఇప్పటికిప్పుడు ఇచ్చే అవసరం లేదు కాబట్టి ప్రీ ప్రొడక్షన్ ముందు పూర్తి చేసుకుని ఆ తర్వాత ప్రకటన గురించి చూద్దామని చెప్పారట. ఒకవేళ నిజమైతే మాత్రం మోస్ట్ ఇంటరెస్టింగ్ కాంబోగా మోక్షజ్ఞ మూవీ నిలిచిపోతుంది.
సార్, లక్కీ భాస్కర్ రెండు బ్లాక్ బస్టర్స్ ని తమ సంస్థకు ఇచ్చిన వెంకీ అట్లూరిని సితార సంస్థ వదలడం లేదు. అందుకే మూడోది తమ బ్యానర్ లోనే లాక్ చేయించుకుంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఎంట్రీనే కొంత లేట్ అయ్యింది కాబట్టి సినిమాలు చేసే విషయంలో మరీ నెమ్మదిగా ఉండకూడదని బాలయ్య, మోక్షజ్ఞ నిర్ణయించుకున్నారట. అందులోనూ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లు దొరికే పరిస్థితి అంత సులభం లేదు కాబట్టి దొరికినప్పుడే లాక్ చేసుకోవాలనే ఆలోచనతో కథలు వింటున్నారని ఇన్ సైడ్ టాక్. ఇవి కాకుండా ఆదిత్య 369 సీక్వెల్ లోనూ మోక్షజ్ఞ కనిపించే ఛాన్స్ ఉంది. కానీ ఇప్పట్లో కాదు.
This post was last modified on December 2, 2024 11:44 am
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……
అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం…