బాలీవుడ్ సినిమాలు రెగ్యులర్ గా చూసేవాళ్లకు పరిచయం అక్కర్లేని పేరు విక్రాంత్ మాసే. 2013 లుటేరేతో ఇండస్ట్రీకి వచ్చిన ఈ విలక్షణ నటుడు కెరీర్ ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న టైంలో హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించి అభిమానుల గుండెల్లో బాంబు పేల్చాడు. కుటుంబం కోసం భర్త, తండ్రిగా నెరవేర్చాల్సిన బాధ్యతలు ఉన్నాయని వాటి కోసం యాక్టింగ్ కి స్వస్తి పలుకుతున్నట్టు సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. వచ్చే సంవత్సరం మరో రెండుసార్లు తెరమీద కలుసుకుంటానని, అవే చివరి సినిమాలని హింట్ ఇచ్చాడు. ఇలా చేయడం వెనుక నిజంగా వ్యక్తిగత కారణాలే ఉన్నాయానేది ముంబై వర్గాల డౌట్.
విక్రాంత్ మాసే కష్టపడి పైకివచ్చాడు. ఎక్కువ శాతం మీడియం బడ్జెట్ చిత్రాలే చేసినప్పటికీ అతని టాలెంట్ ని గుర్తించడానికి పరిశ్రమకు కొన్ని సంవత్సరాలు పట్టింది. 12త్ ఫెయిల్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ఒక్కసారిగా తన స్థాయిని అమాంతం పెంచేసింది. మీర్జాపూర్ వెబ్ సిరీస్ లో బబ్లూగా చేసిన పెర్ఫార్మన్స్ యూత్ లో ఫాలోయింగ్ పెంచింది. హసీనా దిల్రుబా రెండు భాగాల్లోనూ మెరిశాడు. ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన సెక్టార్ 36లో నర హంతకుడిగా సైకో పాత్రలో అద్భుతంగా నటించాడు. ప్రస్తుతం యార్ జిగ్రి, ఆంఖోకి గుస్తాకియాలు సెట్స్ మీదున్నాయి. వచ్చే ఏడాది రిలీజవుతాయి.
ఏది ఏమైనా నాలుగు పదులు వయసు దాటని ఒక టాలెంటెడ్ యాక్టర్ ఇలా చేయడం ఫ్యాన్స్ ని కలవరపరుస్తుంది. గతంలో అమీర్ ఖాన్ కుటుంబం నుంచి వచ్చిన ఇమ్రాన్ ఖాన్ సైతం అచ్చం ఇలాగే ఫ్యామిలీ కోసం సినిమాలు చేయనంటూ గుడ్ బై చెప్పేశాడు. అప్పటికే అతనికి ఆఫర్లు ఇచ్చేందుకు బోలెడు ప్రొడ్యూసర్లు వెయిటింగ్ లో ఉన్నారు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో రీ ఎంట్రీ గురించి హింట్ ఇచ్చాడు కానీ జనాల్లో అంతగా ఆసక్తి లేదు. ట్రైన్ జీవిత కాలం లేట్ అన్నట్టు ఫామ్ లో ఉన్నప్పుడే వీలైనంత పేరు డబ్బు సంపాదించేయాలి. ఒక్కసారి సెలవు తీసుకుంటే మళ్ళీ కంబ్యాక్ కావడం కష్టం.
This post was last modified on December 2, 2024 12:02 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…