Movie News

వరుణ్ తేజ్‌కు ‘కొత్త’ కష్టం

మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం కెరీర్ పరంగా మామూలు ఇబ్బందుల్లో లేడు. అతడికి సోలో హీరోగా ఓ మోస్తరు విజయం దక్కి కూడా చాలా ఏళ్లయిపోయింది. గని, గాండీవధారి అర్జున్, ఆపరేషన్ వాలెంటైన్.. ఇలా తన చివరి మూడు సోలో హీరో సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లవడంతో తన మార్కెట్ దారుణంగా దెబ్బ తింది. ఈ స్థితిలో తన ఆశలన్నీ ‘మట్కా’ మీదే నిలిచాయి.

గత సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా సరే.. ఈ చిత్రం మీద నిర్మాతలు పెద్ద బడ్జెట్టే పెట్టారు. దాదాపు రూ.40 కోట్లతో ఈ సినిమా తీశారు. ఇది తనకు మంచి బ్రేక్ ఇస్తుందని వరుణ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. తీరా చూస్తే వరుణ్ గత సినిమాలే నయం అనుకునేలా చేసింది ‘మట్కా’. మినిమం బుకింగ్స్ లేక.. తొలి రోజే థియేటర్లు వెలవెలబోయి.. ఏ దశలోనూ పుంజుకోలేక బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది ‘మట్కా’. 40 కోట్ల సినిమాకు కోటి రూపాయల షేర్ కూడా రాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

మట్కా రిజల్ట్ వరుణ్ కొత్త సినిమా మీద కూడా ప్రభావం చూపిస్తున్నట్లు సమాచారం. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రాల దర్శకుడు మేర్లపాక గాంధీతో వరుణ్ ఓ సినిమా చేయాల్సి ఉంది. యువి క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయడానికి ఇంతకుముందు ఓకే చెప్పింది. గాంధీ తీసిన ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ చిత్రాన్ని ఆ సంస్థే ప్రొడ్యూస్ చేసింది. కానీ ‘మట్కా’ రిజస్ట్ చూసో ఏమో.. ఆ సంస్థ ఈ ప్రాజెక్టు నుంచి వైదొలిగినట్లు సమాచారం. దీంతో వేరే నిర్మాతలను వెదుక్కోవాల్సిన పరిస్థితి తలెత్తింది.

వరుసగా నాలుగు డిజాస్టర్లంటే ఎలాంటి హీరోకైనా మార్కెట్ దెబ్బ తింటుంది. వరుణ్ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఈ స్థితి నుంచి పుంజుకుని మళ్లీ మార్కెట్ సంపాదించుకోవడం అంత తేలిక కాదు. మరి తన తర్వాతి సినిమాను ప్రొడ్యూస్ చేసే సాహసం ఎవరు చేస్తారన్నది ఆసక్తికరం. గాంధీ కూడా ఫెయిల్యూర్లలో ఉండడం ఈ ప్రాజెక్టుకు మైనస్. తన చివరి రెండు చిత్రాలు ‘లైక్ షేర్ సబ్‌స్క్రైబ్’, ‘కృష్ణార్జున యుద్ధం’ డిజాస్టర్లు అయ్యాయి.

This post was last modified on December 1, 2024 11:03 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పుష్ప కి ప్రమోషన్ అక్కర్లేదు : రాజమౌళి ఎలివేషన్!

కిక్కిరిసిపోయిన అభిమాన జనసందోహం మధ్య పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ యూసఫ్ గూడ గ్రౌండ్స్ లో ఘనంగా…

10 mins ago

పుష్ప 2 టికెట్ రేట్ల మీద కోర్టులో పిటీషన్

పెద్ద హీరోల సినిమాలు మొదటి రెండు వారాలు చూడటం కష్టమనిపించేలా పుష్ప 2 టికెట్ రేట్లకు విపరీతమైన హైక్ ఇవ్వడం…

53 mins ago

మెస్మరైజింగ్ లుక్స్ తో క్లీన్ బౌల్డ్ చేస్తున్న ఆషిక…

2016 లో క్రేజీ బాయ్ అనే కన్నడ మూవీ తో సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది అషికా రంగనాథ్.…

3 hours ago

రకూల్ కి జిమ్ లో ఇంత ప్రమాదం తప్పిందా…

జిమ్‌కు అంద‌రూ ఆరోగ్యం కోస‌మే వెళ్తారు. కానీ అక్క‌డ మ‌రీ హ‌ద్దులు దాటి బ‌రువులు ఎత్తినా.. చేయ‌కూడ‌ని విన్యాసాలు చేసినా…

3 hours ago

పుష్ప‌ గాడి భుజం మామూలైపోయిందే..

తెలుగు సినిమాల్లో హీరోకు శారీర‌క లోపం ఉన్న‌ట్లు కానీ.. అంద విహీనంగా కానీ చూపించేవారు కాదు ఒక‌ప్పుడు. కానీ గ‌త…

3 hours ago

భారత్‌లోనే వారిని ఓడించండి: షోయబ్ అక్తర్

పాకిస్థాన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ చుట్టూ కొనసాగుతున్న వివాదంపై పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ తనదైన శైలిలో స్పందించారు.…

4 hours ago