Movie News

నయన్.. మళ్లీ కౌంటరేసింది!

ఇటీవల తమిళ నటులు నయనతార-ధనుష్‌ మధ్య గొడవ సోషల్ మీడియాను ఎలా కుదిపేసిందో తెలిసిందే. తన వ్యక్తిగత జీవితం, ఫిలిం కెరీర్ నేపథ్యంగా నెట్ ఫ్లిక్స్ కోసం రూపొందించిన ‘నయనతార: బియాండ్ ద ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీ కోసం ధనుష్ ప్రొడ్యూస్ చేసిన ‘నానుం రౌడీ దా’ సినిమా నుంచి ఫుటేజ్ వాడుకోవడానికి అంగీకరించకపోవడాన్ని తప్పుబడుతూ, ధనుష్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ నయన్ రాసిన బహిరంగ లేఖ వైరల్ అయింది.

ఈ వివాదంలో కొందరు ధనుష్‌ను తప్పుబడితే.. ఇంకొందరు నయన్‌ను నిందించారు. కొన్ని రోజుల పాటు దీని మీద పెద్ద చర్చే జరిగింది. ధనుష్ ఈ వివాదం మీద ఏమైనా స్పందిస్తాడేమో అని అంతా ఎదురు చూశారు. కానీ కొన్ని రోజులు మౌనంగా ఉన్న ధనుష్.. ఇటీవలే కోర్టు మెట్లు ఎక్కాడు. నయన్ డాక్యుమెంటరీలో ‘నానుం రౌడీ దా’ ఫుటేజ్ వాడడంతో అతను నయన్, విఘ్నేష్‌ల మీద దావా వేశాడు. ఈ పిటిషన్‌ను కోర్టు విచారణకు కూడా స్వీకరించింది.దీని గురించి వార్త బయటికి రాగానే.. నయన్ నుంచి ఎలాంటి స్పందన ఉంటుందో అని అంతా ఎదురు చూశారు. ఆమె ఈసారి ధనుష్ పేరెత్తకుండా అతడికి కౌంటర్ వేసింది.

మీరు అబద్ధాలతో మరొకరి జీవితాన్ని నాశనం చేయాలని అనుకుంటే దాన్ని అప్పుగా భావించండి. అది రెట్టింపు వడ్డీతో తిరిగి వస్తుంది’’ అంటూ వేదాంత ధోరణిలో పోస్టు పెట్టింది నయన్. తనకు వ్యతిరేకంగా ధనుష్ కోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో అతణ్ని ఉద్దేశించే నయన్ ఈ పోస్టు పెట్టిందని భావిస్తున్నారు. వ్యవహారం కోర్టులో ఉంది కాబట్టి నయన్.. ధనుష్‌‌ మీద నేరుగా విమర్శలు చేయట్లేదని అనుకుంటున్నారు. తన డాక్యుమెంటరీ నెట్ ఫ్లిక్స్ ద్వారా రిలీజయ్యాక.. దాని కోసం ఫుటేజ్ వాడుకోవడానికి అనుమతి ఇచ్చిన నిర్మాతలందరికీ థ్యాంక్స్ చెబుతూ ఒక నోట్ కూడా రిలీజ్ చేసింది నయన్. అప్పుడు కూడా పరోక్షంగా ధనుష్‌ను కౌంటర్ చేసినట్లే భావించారు. ఇప్పుడు ఈ కోట్ ద్వారా మరోసారి అతణ్ని ఎటాక్ చేసినట్లు కనిపిస్తోంది.

This post was last modified on November 30, 2024 9:42 am

Share

Recent Posts

టీడీపీకి 58 కోట్లు.. వైసీపీకి 24 కోట్లు.. బీఆర్ ఎస్‌కు 16 కోట్లు..

భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన విరాళాల నివేదికల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజకీయ పార్టీలు తమకు అందిన…

1 hour ago

కార్తీ రేంజు ఇంత పడిపోయిందా

యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఖైదీ, ఊపిరి లాంటి సూపర్ హిట్స్ తో కార్తీకి తెలుగులోనూ సాలిడ్ మార్కెట్…

3 hours ago

జడల్ జమానాకు ఇంకో కీలక ఛాన్స్

నైజాంలో డీసెంట్ గా నెట్టుకొస్తున్న ప్యారడైజ్ రెండో వారంలోకి అడుగు పెట్టడానికి ముందే ఆంధ్ర, సీడెడ్ సైడ్ బాగా నెమ్మదించిపోవడం…

3 hours ago

ఖైరతాబాద్ నుంచి జనసేన పోటీ

ఏ నిముషంలో దానం నాగేందర్ పార్టీ మారి ఎమ్మెల్యే పదవి కోల్పోయాడో కానీ తెలంగాణా రాజకీయాలు మరింత సందడిగా మారిపోయాయి.…

4 hours ago

రాజమౌళి చెప్పిన ఈ ఫార్ములా ఫాలో అయితే?

రాజమౌళి తన సినిమాల మేకింగ్ కోసం ఎక్కువ టైం తీసుకుంటాడన్న మాటే కానీ.. ఔట్ పుట్ మాత్రం వేరే లెవెల్లో…

4 hours ago

వెంకటేష్ చెంప మీద ఎందుకు కొట్టుకున్నాడు

దర్శకుడు యాక్షన్ చెప్పాక.. యాక్టర్ డైలాగ్ మరిచిపోతే ఏమవుతుంది? కట్ చెప్పి మళ్లీ ఆ సీన్ తీస్తారు కదా. ‘ఆదర్శ…

4 hours ago