ప్రభాస్ సినిమా ‘కల్కి: 2898 ఏడీ’లో బోలెడన్ని క్యామియోలు చూశాం. విజయ్ దేవరకొండ, రాజమౌళి, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రామ్ గోపాల్ వర్మ.. ఇలా చాలామందే ప్రత్యేక పాత్రల్లో మెరిశారు. ఐతే వాళ్లను మించి కేవలం తన వాయిస్‌తోనే ప్రత్యేకమైన వేసింది కీర్తి సురేష్. హీరో సొంతంగా డిజైన్ చేసుకున్న బుజ్జి అనే కస్టమైజ్డ్ వెహికల్‌కు కీర్తి గాత్రదానం చేసింది. సినిమాలో దాన్నొక ముఖ్యమైన పాత్రలాగా చూపించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఈ క్యారెక్టర్‌కు కీర్తి ఇచ్చిన వాయిస్ ఓవర్ బాగా హైలైట్ అయింది. సినిమాలో నటించకపోయినా.. అంతకుమించిన ఇంపాక్ట్ చూపించింది కీర్తి. ఐతే నిజానికి ఇలా వాయిస్ ఓవర్‌తో సరిపెట్టకుండా.. ఈ సినిమాలో కీర్తి ఒక పాత్రలో నటించాల్సిందట. నాగి ఆమెకు ఒక హ్యూమన్ క్యారెక్టరే ఆఫర్ చేశాడట. కానీ కీర్తినే ఆ పాత్ర చేసేందుకు ఆసక్తి చూపించలేదట.
‘మహానటి’తో తన కెరీర్‌ను మలుపు తిప్పిన నాగ్ అశ్విన్.. ‘కల్కి’లోనూ ఓ పాత్ర కోసం తనను అడిగాడని.. ఐతే ఆ క్యారెక్టర్ తనకు అంత ఆసక్తికరంగా అనిపించలేదని కీర్తి చెప్పింది. ఐతే ఏదో రకంగా తాను ఈ ప్రాజెక్టులో భాగం అవుతానని తనకు తెలుసని.. నాగి అడిగిన పాత్ర పట్ల తాను కొంచె అయిష్టత వ్యక్తం చేయడంతో తర్వాత బుజ్జి పాత్రకు వాయిస్ ఓవర్ చెబుతావా అని అని అడిగాడని.. అది తనకు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించి ఓకే చెప్పానని కీర్తి వెల్లడించింది.
తాను నో చెప్పిన పాత్ర ఏదో వెల్లడించడానికి కీర్తి ఇష్టపడలేదు. కానీ ఆ పాత్రలో నటించడం కంటే కూడా బుజ్జి పాత్రకు వాయిస్ ఓవర్ ఇవ్వడమే తనకు ఎక్కువ మజానిచ్చిందని.. తన కెరీర్లో అత్యంత ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పిన పాత్ర ఇదేనని ఆమె చెప్పింది. దీన్ని తాను నటించిన ఒక క్యారెక్టర్ లాగే తాను ఫీలవుతానని.. ఈ పాత్రకు డబ్బింగ్ చెబుతూ తాను ఎంతో నేర్చుకున్నానని కూడా ఆమె తెలిపింది.
This post was last modified on November 30, 2024 9:51 am
సంధ్య థియేటర్ ఘటన నుంచి క్రమంగా బయటపడుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమాల ప్రపంచంలోకి వచ్చేస్తున్నాడు. పుష్ప 3 ఉంటుందో…
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అభిమానుల నుంచి తిప్పలు మామూలుగా ఉండడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా..…
ఏపీలోని కూటమి ప్రభుత్వం తనకు భయపడుతోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు భయపడుతున్న…
ఏపీ రాజకీయాల్లో ఉప్పు-నిప్పుగా వ్యవహరించే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌లు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చి ఆయన పాదాల చెంత తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు…
ఒక హీరో దర్శకత్వం వహించి నిర్మించడమంటే మాములు విషయం కాదు. ఒకప్పుడు ఎన్టీఆర్, కృష్ణ లాంటి లెజెండ్స్ దీన్ని సమర్ధవంతంగా…