సేమ్ ఇస్మార్ట్ స్కూలే!

ఇప్పటి యూత్ కి బూతులు మాట్లాడే బాడ్ బాయ్స్ నచ్చుతున్నారని పసిగట్టి పూరి జగన్నాధ్ తన రెగ్యులర్ హీరోనే ఇంకాస్త పచ్చిగా చూపించాడు. ఇస్మార్ట్ శంకర్ పెద్ద హిట్టయి కూర్చుంది. అంతవరకు రామ్ అలా కనిపించకపోవడం కూడా దీనికి కారణమే. ఇప్పుడు పూరి అదే స్కూల్ లో విజయ్ దేవరకొండని చూపిస్తున్నాడు.

ఫైటర్ చిత్రంలో విజయ్ దేవరకొండ పాత్ర కూడా ఇస్మార్ట్ మాదిరిగానే బూతులు మాట్లాడ్డం, కొందరు జనాలు హేట్ చేసేలా ప్రవర్తించడం చేస్తుందట. పూరి సినిమాల్లో ఇది రొటీన్ అయినా కానీ విజయ్ ఇలా ప్రవర్తిస్తే కిక్ ఇస్తుందనేది వాళ్ళ నమ్మకం. పూరి జగన్నాధ్ తో సినిమా అంటే మొదట్లో అటు ఇటు అయిన విజయ్ వరుస పరాజయాలతో తనకి కూడా ఇమేజ్ మేకోవర్ అవసరమని ఇది చేస్తున్నాడు.

ఈ చిత్రంలో మదర్ సెంటిమెంట్ తో పాటు కిక్ బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ కూడా ఉంటుంది. వినడానికి అమ్మ నాన్న ఓ తమిళమ్మాయిలా అనిపిస్తున్నా కానీ ఇస్మార్ట్ ఫార్ములా దీన్ని కొత్తగా చూపిస్తుందని పూరి కాన్ఫిడెన్స్.