Movie News

లేదు లేదంటూనే భ‌య‌ప‌డ్డ సిద్ధు

ఒక‌ప్పుడు తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఒక ఊపు ఊపిన త‌మిళ‌ హీరో సిద్దార్థ్.. త‌ర్వాత ఇక్క‌డ వ‌రుస‌ ఫ్లాపులు ఎదుర‌వ‌డంతో కోలీవుడ్లోకి వెళ్లిపోయాడు. అక్క‌డే సినిమాలు చేస్తూ వ‌చ్చాడు. కానీ అక్క‌డ కూడా ఈ మ‌ధ్య స‌రైన విజ‌యం లేదు సిద్ధుకు చిత్తా (తెలుగులో చిన్నా) మాత్ర‌మే ఓ మోస్త‌రుగా ఆడింది. దాని త‌ర్వాత వ‌చ్చిన సినిమాల‌న్నీ నిరాశ‌ప‌రిచాయి. ఇప్పుడు అత‌డి ఆశ‌ల‌న్నీ మిస్ యు మీదే ఉన్నాయి. నా సామి రంగ‌తో ఆక‌ట్టుకున్న ఆషిక రంగ‌నాథ్ ఇందులో హీరోయిన్. ప్రోమోలు చూస్తే మంచి ఫీల్ ఉన్న ల‌వ్ స్టోరీలా క‌నిపిస్తోంది. ఈ చిత్రం శుక్ర‌వార‌మే విడుద‌ల కావాల్సి ఉంది.

ఇటీవ‌లే హైద‌రాబాద్‌కు వ‌చ్చి సినిమాను ప్ర‌మోట్ చేసంది టీం. సిద్ధు ఆ సంద‌ర్భంగా పాల్గొన్న ప్రెస్ మీట్ ఆస‌క్తిక‌రంగా సాగింది. వ‌చ్చే వారం పుష్ప‌-2 లాంటి పెద్ద సినిమా వ‌స్తున్న నేప‌థ్యంలో మీకు ఇబ్బంది లేదా అని అడిగితే.. విష‌యం ఉన్న సినిమాను ఎవ్వ‌రూ అడ్డుకోలేర‌ని, తమ‌కు ఆ సినిమా విష‌యంలో ఎలాంటి భ‌యం లేద‌ని.. భ‌య‌ప‌డితే వాళ్లే ప‌డాల‌న్న‌ట్లుగా మాట్లాడాడు సిద్ధు.

ఆ రోజు త‌న కాన్‌ఫిడెన్స్ చూసి అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. క‌ట్ చేస్తే ఇప్పుడు మిస్ యు సినిమా అనూహ్యంగా వాయిదా ప‌డిపోయింది. విడుద‌లకు రెండు రోజుల ముందు వాయిదా నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించింది చిత్ర బృందం. ఐతే ఇందుకు చిత్ర‌మైన కార‌ణం చెప్పింది. రాబోయే రోజుల్లో భారీ వ‌ర్షాలు ప‌డ‌తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ చెబుతోంద‌ని.. వ‌ర్షాల్లో ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్ల‌కు రప్పించి ఇబ్బంది పెట్టాల‌నుకోవ‌డం లేద‌ని.. వాళ్ల క్షేమ‌మే త‌మకు ముఖ్య‌మ‌ని పేర్కొన్నారు.

ఐతే త‌మిళ‌నాట వ‌ర్షాలు ప‌డుతున్న మాట వాస్త‌వ‌మే కానీ.. ఆ కార‌ణంతో విడుద‌ల‌కు రెండు రోజుల ముందు సినిమాను వాయిదా వేయ‌డంలో ఆంత‌ర్య‌మేంటి అని ఆశ్చ‌ర్య‌పోతున్నారు. పుష్ప‌-2 సినిమాకు త‌మిళ‌నాట కూడా మంచి హైపే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే చెప్పాల్సిన ప‌నే లేదు. మిస్ యు అస‌లిక్క‌డ బ‌జ్ యే లేదు. అంద‌రి దృష్టీ పుష్ప‌-2 మీదే ఉంది. దానికి భ‌య‌ప‌డే మిస్ యు టీం సినిమాను వాయిదా వేసి ఉంటుంద‌ని.. వ‌ర్షాల‌ను సాకుగా మాత్ర‌మే చూపిస్తోంద‌ని సోష‌ల్ మీడియా జ‌నాలు అభిప్రాయ‌ప‌డుతున్నారు. లేదు లేదంటూనే సిద్ధు అండ్ టీం పుష్ప‌-2కు భ‌య‌ప‌డింద‌ని కామెంట్లు చేస్తున్నారు.

This post was last modified on November 28, 2024 12:58 pm

Share

Recent Posts

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

1 hour ago

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

2 hours ago

మోహన్ బాబును మోసం చేసిన ఓదెల

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…

3 hours ago

‘హోటళ్ళు నా భార్యా బిడ్డల కోసం’

సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…

4 hours ago

హిట్టు కొట్టిన పది నెలలకు దర్శనం

టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…

4 hours ago

షాకింగ్ టాక్… బత్తా అంత కొత్తగా ఉందా

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…

6 hours ago