ఇంకో తొమ్మిది రోజుల్లో విడుదల కాబోతున్న పుష్ప 2 ది రూల్ కు సంబంధించిన ఏ వార్తయినా విపరీతమైన హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ నేపథ్యంలో రన్ టైంకి సంబంధించిన ఒక అప్డేట్ సంచలనమనేలా ఉంది. సెన్సార్ కు వెళ్ళబోతున్న ఫైనల్ కట్ 3 గంటల 21 నిముషాలు వచ్చిందని సమాచారం. ఇంత నిడివితో ఒక స్ట్రెయిట్ టాలీవుడ్ మూవీ వచ్చి దశాబ్దాలు దాటిపోయింది. ఆ మధ్య ఇంతే నిడివితో సందీప్ రెడ్డి వంగా యానిమల్ రిలీజ్ చేస్తే ముందు అందరూ అనుమానపడ్డారు. కట్ చేస్తే ఏ మాత్రం విసుగు లేకుండా ఒకటే ఇంటర్వెల్ ఉన్నా కూడా ప్రేక్షకులు రన్బీర్ విశ్వరూపాన్ని ఎంజాయ్ చేశారు.
ఇప్పుడు పుష్ప 2 కూడా అదే లెన్త్ ఖరారు చేసుకుంటే మాత్రం అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు పండగే. అయితే షోలకు విపరీతమైన డిమాండ్ ఉన్న నేపథ్యంలో మల్టీప్లెక్సులకు షెడ్యూలింగ్ చేసుకోవడం సవాల్ కానుంది. కాకపోతే యానిమల్ మోడల్ ని ఇక్కడా ఫాలో అవుతారు కాబట్టి ఇబ్బంది లేదు కానీ డిమాండ్ ప్రకారం చూసుకుంటే పుష్ప 2 ఎన్నో రెట్లు పైనుంది. ఇంటర్వెల్ తో కలిపి ఆడియన్స్ మూడున్నర గంటల పాటు థియేటర్లోనే ఉండాల్సి వస్తుంది. కంటెంట్ అంత బలంగా ఉన్నప్పుడు ఇదేమి సమస్య కాదు కానీ షోల మధ్య గ్యాప్ మాత్రం కేవలం కొన్ని సెకండ్లు లేదా నిమిషాలే ఉంటుంది.
దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. పుష్ప 2 పనులు ఆఘమేఘాల మీద జరుగుతున్నాయి. ఒకపక్క ప్రమోషనల్ ఈవెంట్లు ప్లాన్ చేసుకుంటూనే ఇంకోవైపు ఫైనల్ కాపీ వర్క్స్ ని దర్శకుడు సుకుమార్ దగ్గరుండి చూసుకుంటున్నారు. ఏ మాత్రం ఆలస్యం లేకుండా అన్నీ అనుకున్న ప్రకారం జరిగిపోతున్నాయట. డిసెంబర్ 4 రాత్రే ప్రీమియర్లు వేసే ఆలోచన ఉంది కనక దానికి అనుగుణంగా డిస్ట్రిబ్యూటర్లు రెడీ అవుతున్నారు. పుష్ప 2 ఫీవర్ దెబ్బకు జనాలు కొత్త సినిమాలు చూసే మూడ్ లో లేరు. అందుకే కాస్తో కూస్తో జీబ్రా తప్ప ఇంకే కొత్త రిలీజులు బాక్సాఫీస్ వద్ద సౌండ్ చేయడం లేదు.
This post was last modified on November 26, 2024 4:23 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…