టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ‘ఆకాశం దాటి వస్తావా’ చిత్రంలో ధనశ్రీ కథానాయికగా నటిస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో డ్యాన్స్ నేపథ్యంలో ఆసక్తికర కథ నడవనుందని తెలుస్తోంది.
ఈ సినిమాలో ప్రముఖ కొరియోగ్రాఫర్ యష్ మాస్టర్ హీరోగా పరిచయమవుతున్నారు. ధనశ్రీ డ్యాన్స్ నైపుణ్యాలను దృష్టిలో ఉంచుకొని ఆమెను కథానాయికగా ఎంపిక చేసినట్లు చిత్ర యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఆమె భాగం కొంత షూటింగ్ పూర్తయినట్టు వార్తలు వెలువడుతున్నాయి. ‘ఆకాశం దాటి వస్తావా’ షూటింగ్ గత కొంతకాలంగా కొనసాగుతుండగా, ఈ ఏడాది చివర్లో సినిమా విడుదల కానుందని భావిస్తున్నారు.
ధనశ్రీ వర్మ తన డ్యాన్స్ వీడియోలతో సోషల్ మీడియా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. యూట్యూబ్ వేదికగా లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆమె, ఆల్బమ్ సాంగ్స్‌తోనూ పాపులర్ అయ్యారు. డ్యాన్స్ ప్రధానంగా ఉండే కథకు సరిపోయే హీరోయిన్ కావాలని భావించిన దర్శకుడు ధనశ్రీని సంప్రదించగా, ఆమె వెంటనే ఆమోదం తెలిపిందట.
ఇప్పటికే షూటింగ్ సెట్స్ నుంచి బయటకు వచ్చిన ఫోటోలు, వీడియోలు ఆమె టాలీవుడ్‌లో ఎంట్రీ పుకార్లకు బలం చేకూరుస్తున్నాయి. ఈ సినిమాతో ధనశ్రీ కెరీర్ మరో కొత్త మలుపు తిరగనుందని అంచనా. టాలీవుడ్‌కి ధనశ్రీ రావడంతో, ఇది ప్రేక్షకుల్లోనే కాక, యుట్యూబ్ ఫ్యాన్స్‌లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. సినిమా విడుదల తర్వాత ధనశ్రీ పెర్ఫార్మెన్స్ తెలుగు ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
This post was last modified on November 23, 2024 6:35 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…