దేశవ్యాప్త సినీ ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు మణిరత్నం. మౌనరాగం, నాయకుడు, గీతాంజలి, ఘర్షణ, రోజా, బొంబాయి లాంటి ఎన్నో మర్చిపోలేని క్లాసిక్స్ ఇచ్చి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. అయితే టెక్నాలజీ అంతగా లేని రోజుల నుంచి విఎఫెక్స్ ఆధిపత్యం చెలాయించే ట్రెండ్ దాకా నాలుగు దశాబ్దాల దర్శకుడిగా ఆయన చేసిన ప్రయాణంలో చూడని మజిలీలు ఉండవు. వెనుకబడి పోతున్నారనుకుంటున్న టైంలో ఓకే బంగారం లాంటి హిట్టుతో కంబ్యాక్ ఇచ్చి బాహుబలి స్ఫూర్తితో పొన్నియిన్ సెల్వన్ రెండు భాగాలతో తమిళంలో రికార్డు బ్లాక్ బస్టర్ సాధించడం ఆయనకే చెల్లింది.
గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో మా సైట్ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానంగా థియేటర్ కు ఓటిటికి మధ్య వ్యత్యాసాన్ని మణిరత్నం వివరించిన తీరు ఆలోచింపజేసేలా ఉంది. పొన్నియిన్ సెల్వన్ ఒకవేళ ఎక్కువ నిడివి ఉండే వెబ్ సిరీస్ గా తీసి ఇంకా డెప్త్, ఎమోషనల్ గా చెప్పే అవకాశం దక్కేది కదా అనేది ప్రశ్న. దానికి మణిరత్నం బదులిస్తూ పీఎస్ తాను కేవలం బిగ్ స్క్రీన్ మీద మాత్రం ఆవిష్కరించాలనుకున్న కలని, రివైండ్ ఫార్వార్డ్ చేస్తూ మధ్యలో కాల్స్ మెసేజెస్ చూసుకునే స్మార్ట్ ఫోన్లు, టీవీల కోసం రాసుకోలేదని అన్నారు. వెండితెరపై అనుభూతిని ఇంకే ప్రత్యాన్మయం ఇవ్వలేదని చెప్పారు.
ఇది చాలా మంచి పాయింట్. ఎందుకంటే ఓటిటిలు వచ్చాక ప్రేక్షకులు థియేటర్లకు రావాలంటే దాన్ని డిమాండ్ చేసే కంటెంట్ ఉంటేనే టికెట్లు కొంటున్నారు. పొన్నియిన్ సెల్వన్ ఒకవేళ నిజంగా సిరీస్ గా వచ్చి ఉంటే ఇంత స్పందన వచ్చేది కాదేమో. తెరనిండా తారలను చూసుకుంటే కలిగే ఆనందం స్మార్ట్ ఫోన్ ఎలా ఇవ్వగలదు. అయితే భవిష్యత్తులో అవసరమైతే సుదీర్ఘంగా చెప్పాలనుకునే కథ రాసుకుంటే సిరీస్ తీస్తానని మణిరత్నం నర్మగర్భంగా చెప్పడం కొసమెరుపు. కమల్ హాసన్, శింబుతో ఆయన రూపొందించిన ధగ్ లైఫ్ ప్రధాన ప్యాన్ ఇండియా భాషల్లో 2025 వేసవి విడుదలకు రెడీ అవుతోంది.
This post was last modified on November 23, 2024 2:39 pm
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…